Pears Fruit : పియర్స్ పండ్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..! హార్ట్ పేషెంట్లకు, ఒబేసిటీ సమస్యలున్నవారికి దివ్య ఔషధం..

Pears Fruit :యాపిల్ పండులాగే కనిపించే పియర్స్ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పియర్స్ పండ్లను ప్రజలు పెద్దగా తినేందుకు ఆసక్తి చూపించరు.

Pears Fruit : పియర్స్ పండ్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..! హార్ట్ పేషెంట్లకు, ఒబేసిటీ సమస్యలున్నవారికి దివ్య ఔషధం..
Pears Fruit
Follow us

|

Updated on: Aug 09, 2021 | 1:16 PM

Pears Fruit :యాపిల్ పండులాగే కనిపించే పియర్స్ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పియర్స్ పండ్లను ప్రజలు పెద్దగా తినేందుకు ఆసక్తి చూపించరు. కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. వీటిని మన తెలుగులో బేరి పండు అంటారు. ఇది తియ్యగా ఎక్కువ ఫైబర్ ఉండే పండు. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో కాల్షియం, ఫొలేల్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్ C, E, K ఉంటాయి. అలాగే బీటా-కెరోటిన్, ల్యూటెయిన్, ఖోలైన్, రెటినాల్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాదు.. రెగ్యులర్‌గా పియర్స్ తినడం వల్ల బరువు తగ్గుతున్నట్లు, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల వంటివి నయమవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.

డయాబెటిస్ పేషెంట్లు దీన్ని చక్కగా తినవచ్చు. హార్ట్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు ఇది తింటే బరువు పెరగరు. ఇక మలబద్దక సమస్యలు ఉండవు తొందరగా ఆకలి వేయదు. పియర్స్ పండుని మందుల తయారీలోనూ వాడుతున్నాయి పలు కంపెనీలు. ఈ పండ్లలో విటమిన్ A కూడా ఉంటుంది. పియర్స్ లో రాగి, కాల్షియం, పాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. దీని వల్ల ఎముకలు చాలా బలంగా తయారు అవుతాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది బాడీలో వేడిని ఈ పండ్లు తగ్గించేస్తాయి. పియర్స్‌లో ఉండే ఫైబర్ వల్ల మన శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గి బాడీ వెయిట్ కూడా కంట్రోల్ అవుతుంది.

ఇవి ఎర్రరక్త కణాల సంఖ్యని పెంచుతాయి. నీరసం తగ్గిస్తుంది. ఈ ఫ్రూట్ లో విటమిన్ సీ ఉంటుంది. ఈ పండు తినడం వల్ల మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని తేలింది. ఈ పండ్లలో ఫైబర్ ఉండటం వల్ల చాలా మంది వైద్యులు కూడా తీసుకోమని చెబుతారు. అయితే ఈ పండ్లు మితంగానే తీసుకోవాలి. రోజుకు రెండు కంటే ఎక్కువ పండ్లను తింటే కడుపులో గ్యాస్, పొట్ట ఉబ్బరం, నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి.

Dreams : ఈ రకమైన కలలు మీరు ధనవంతుడు కాబోతున్నారని సూచిస్తాయి..! ఆ లక్ష్మి కటాక్షం మీపై ఉందని సంకేతం..

Basara IIIT Notification: బాసర ట్రిపుల్‌ ఐటీలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి ఎలా భర్తీ చేయనున్నారో తెలుసా?

Azadi ka Amrut Mahotsav: దేశ వ్యాప్తంగా ఆజాదీ కీ అమృత్‌.. ప్రతి ఒక్కరు జాతీయ గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

Latest Articles