Azadi ka Amrut Mahotsav: దేశ వ్యాప్తంగా ఆజాదీ కీ అమృత్‌.. ప్రతి ఒక్కరు జాతీయ గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

Azadi ka Amrut Mahotsav: భారత్ 75వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ ప్రతి ఒక్కరు జాతీయ గీతాన్ని ఆలపించాల్సిన అవసరం ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఆజాదీ కీ అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా ప్రతి పౌరుడు..

Azadi ka Amrut Mahotsav: దేశ వ్యాప్తంగా ఆజాదీ కీ అమృత్‌.. ప్రతి ఒక్కరు జాతీయ గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
Azadi Ka Amrut Mahotsav
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 09, 2021 | 12:51 PM

భారత్ 75వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ ప్రతి ఒక్కరు జాతీయ గీతాన్ని ఆలపించాల్సిన అవసరం ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఆజాదీ కీ అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా ప్రతి పౌరుడు జనగణమణ పాడాలని పిలుపునిచ్చారు కిషన్‌రెడ్డి.  50 లక్షల మంది భారతీయులు ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్నారని.. మీరు కూడా జాతీయ గీతాన్ని పాడి www.rashtragaan.in.లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఆగస్ట్‌ 15న ఈ వీడియోలను లైవ్‌లో ప్రసారం చేస్తామని తెలిపారు కిషన్‌రెడ్డి. మీరు జాతీయ గీతాన్ని పాడడమే కాకుండా ఇతరులను కూడా జనగణమణ పాడే విధంగా ప్రోత్సాహించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ఈ కార్యక్రమాలు 75 వారాల పాటు జరుగుతాయని పేర్కొన్నారు.

“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” లో ప్రజలందరూ భాగం కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో సర్పంచులు కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ జాతీయగీతం పాడి రాష్ట్ర గీత్ వెబ్ సైట్ లో ఉంచాలని సూచించారు. 2047 నాటికి దేశం ఏ స్థాయికి చేరాలో తమ అభిప్రాయాలను పంచుకోవాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి: Journalist Murder: గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు కేశవ దారుణ హత్య.. కర్నూలు జిల్లాలో దారుణం..

Dating App: ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇచ్చే డీల్స్‌పై భారతీయులు భయపడుతున్నారు.. సర్వేలో తేలిన నమ్మలేని నిజాలు..