AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము కరవడంతో.. కోపంతో కొరికి చంపాడు..! చెట్టుకు వేలాడదీశాడు కానీ చివరకు ఇలా..

Snake Bite : బిహార్‌లోని నలంద జిల్లాలో ఓ వృద్ధుడిని పాము కరిచింది. అయితే కోపంతో ఊగిపోయిన అతడు పామును కొరికి చంపాడు. కానీ వృద్ధుడు కూడా వెంటనే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పాము కరవడంతో.. కోపంతో కొరికి చంపాడు..! చెట్టుకు వేలాడదీశాడు కానీ చివరకు ఇలా..
Snakes
uppula Raju
|

Updated on: Aug 09, 2021 | 11:29 AM

Share

Snake Bite : బిహార్‌లోని నలంద జిల్లాలో ఓ వృద్ధుడిని పాము కరిచింది. అయితే కోపంతో ఊగిపోయిన అతడు పామును కొరికి చంపాడు. కానీ వృద్ధుడు కూడా వెంటనే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమామహ అనే వృద్ధుడు నలంద ప్రాంతంలోని మాధోపూర్ దేహ్ గ్రామ నివాసి. శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటి వద్ద అతడిని ఒక పాము కాటు వేసింది. ఆ సమయంలో మహ మద్యం మత్తులో ఉన్నాడు. దీంతో పామును చేత పట్టుకుని నోటితో కొరుకుతూ చంపాడు. నువ్వు నన్ను కొరుకు, నేను నిన్ను కొరుకుతా అంటూ ఇష్టమొచ్చిన రీతిలో కొరికాడు. అయితే పామును కొరికే సమయంలో అది నోటిలో చాలా చోట్ల కాటు వేసింది. దీంతో వృద్ధుడికి తీవ్ర రక్తస్రావం అయింది.

అయితే పాము చంపిన తర్వాత దానిని ఇంటి సమీపంలోని చెట్టుకు కట్టి వేలాడదీశాడు. చుట్టుపక్కల ప్రజలు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇచ్చారు. కానీ ఆ పాము చిన్నదని దానికి విషం ఉండదని చెప్పి అలాగే పడుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధుడిని గుర్తించారు. ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడి వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారంచారు. పాముకాటు కారణంగా మరణించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏమి కాదులే అనే నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైంది.

తాజాగా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడు కూడా ఇలాగే చేశాడు. కానీ అతడు సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడానికి ఇలా చేశాడు. వైరల్ కావడం కోసం ఏకంగా బ్రతికున్న పామును తింటూ వీడియో తీశాడు. చిన్న పాముపిల్లను తీసుకుని దాని తలను నోట్లో పెట్టుకుని కరకరా కొరుకుతూ నమిలి మింగాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాపం.! ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ పాము మెలికలు తిరుగుతూ గిలగిలా కొట్టుకుంది. క్షణాల్లో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

Shiva Idol: నీటి కాలువలో శివుడి విగ్రహం ప్రత్యక్షం.. ఆ దేవుడి మహిమే అంటోన్న స్థానికులు.

అరచేతిలో దురద, గుడ్లగూబను చూడటం శుభ సూచకాలు..! మీకు డబ్బు రాబోతుందని సంకేతం.. ఎలాగో తెలుసుకోండి..

Viral Video: సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!