Shiva Idol: నీటి కాలువలో శివుడి విగ్రహం ప్రత్యక్షం.. ఆ దేవుడి మహిమే అంటోన్న స్థానికులు.

Shiva Idol: నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో అద్భుతం జరిగింది. పట్టణంలోని నీటి కాలువలో శివుడి ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున విగ్రహానికి చూడడానికి...

Shiva Idol: నీటి కాలువలో శివుడి విగ్రహం ప్రత్యక్షం.. ఆ దేవుడి మహిమే అంటోన్న స్థానికులు.
Shiva
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 09, 2021 | 10:46 AM

Shiva Idol: నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో అద్భుతం జరిగింది. పట్టణంలోని నీటి కాలువలో శివుడి ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున విగ్రహానికి చూడడానికి ఆసక్తి చూపించారు. శ్రావణ మాసం ప్రారంభమైన వేళ, అందులోనూ శివుడికి ఎంతో ప్రీతిప్రాతమైన సోమవారం రోజున శివుడి విగ్రహం ఇలా కనిపించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా ఆ దేవదేవుడి మహిమే అంటూ పూజలు చేయడం ప్రారంభించారు.

ఇదిలా ఉంటే ఈ నీటి కాలువలో దేవతా మూర్తుల విగ్రహం బయటపడడం ఇదే తొలిసారి కాదు. 21 రోజుల క్రితం ఇదే నీటి కాలువలో గంగమ్మ విగ్రహం కూడా బయటపడింది. ఇలా తక్కువ వ్యవధిలో గంగ-శివుడి విగ్రహాలు ప్రత్యక్షం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నీటి ప్రవాహంలో నాలుగు అడుగుల విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. నీటి ప్రవాహం ఉదృతంగా ఉన్నప్పటికీ విగ్రహం కదళపోవడం విశేషం.  ఈ విగ్రహాలు చూస్తుంటే పురాతన కాలానికి చెందినవిగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంపై అందరి దృష్టి పడింది. ఈ విగ్రహాలు కాలువలోకి ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయం తెలియాల్సి ఉంది.  ఈ ప్రాంతంలో తవ్వకాలు చేస్తే చరిత్రకు సంబంధింన ఆనవాళ్లు ఏమైనా బయటపడొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. గంగమ్మ ఒడిలో శివుడు సేదతీరుతున్నట్లు ఉన్న ఈ వీడియోను మీరూ ఓ సారి చూసేయండి.

Also Read: Uttarakhand Landslide: భారీ వర్షాలు.. వరదలు.. ఉత్తరాఖండ్ లో కుప్ప కూలిన హోటల్ బిల్డింగ్

Anil Ravipudi : దానికి దీనికి అస్సలు సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి..

ఆ దుర్గా మాతకు 20 గ్రాముల గోల్డ్ మాస్క్.. కోవిడ్ పై భక్తుల్లో అవగాహన కలిగించడానికే ! ఎక్కడంటే..?