Uttarakhand Landslide: భారీ వర్షాలు.. వరదలు.. ఉత్తరాఖండ్ లో కుప్ప కూలిన హోటల్ బిల్డింగ్

ఉత్తరాఖండ్ లోని జోషీ మఠ్ సమీపానగల ఓ హోటల్ బిల్డింగ్ లో కొంత భాగం సోమవారం ఉదయం కుప్ప కూలిపోయింది. కొండ అంచుల్లో ఉన్న ఈ బిల్డింగ్ లోయలోకి కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Uttarakhand Landslide: భారీ వర్షాలు.. వరదలు.. ఉత్తరాఖండ్ లో కుప్ప కూలిన హోటల్ బిల్డింగ్
Hotel Building Collapsed In Uttarakhand
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Aug 09, 2021 | 10:10 AM

ఉత్తరాఖండ్ లోని జోషీ మఠ్ సమీపానగల ఓ హోటల్ బిల్డింగ్ లో కొంత భాగం సోమవారం ఉదయం కుప్ప కూలిపోయింది. కొండ అంచుల్లో ఉన్న ఈ బిల్డింగ్ లోయలోకి కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదాన్ని ముందే గుర్తించిన అధికారులు, హోటల్ యాజమాన్యం ఇందులోని వారిని ఖాళీ చేయించారు. ఎన్టీపీసీ టన్నెల్ కి టాప్ లో ఉన్న ఈ హోటల్..వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడడంతో పగుళ్లు విచ్చి బలహీనమైపోయిందని అధికారులు తెలిపారు. హోటల్ లో ఉన్నవారెవరూ గాయపడలేదన్నారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతోంది. డెహ్రాడూన్, నైనిటాల్, పౌరి, ఉత్తర కాశి తదితర జిల్లాలు, నగరాల్లో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.చంపావత్ జిల్లాలో తనక్ పూర్ ఘాట్-నేషనల్ హైవే పూర్తిగా దెబ్బ తిన్నదని అధికారులు తెలిపారు. ఇక్కడిసి సమీపంలోని రైనీ గ్రామంతో సహా మరికొన్ని గ్రామాలకు వరద ముప్పు ఉందని వారు చెప్పారు.రిషి గంగా, దౌలీ గంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 300 గ్రామాలకు ముప్పు తప్పకపోవచ్చునని అంచనా వేస్తున్నారు.

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ సైతం జల విలయంలో చిక్కుకోవచ్చునని ఆందోళన చెందుతున్నారు. ఆకస్మిక వరదల కారణంగా రాష్ట్రానికి సుమారు 500 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని ప్రభుత్వం తెలిపింది. లోతట్టు ప్రాంతాలవారిని సురక్షిత ప్రదేశాలకు తరలించినట్టు వెల్లడించింది. ఇప్పటికే సహాయక శిబిరాల్లో వేలమంది తలదాచుకుంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆ దుర్గా మాతకు 20 గ్రాముల గోల్డ్ మాస్క్.. కోవిడ్ పై భక్తుల్లో అవగాహన కలిగించడానికే ! ఎక్కడంటే..?

పాకిస్తాన్ లోని క్వెట్టాలో బాంబు పేలుడు.. ఇద్దరు పోలీసుల మృతి.. 13 మందికి గాయాలు

మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?
వెలుగులోకి నయా స్కామ్.. ఆర్డర్ చేయకుండా ఇంటికి వస్తువు వచ్చిందా.?
గడ్డకట్టిన జలపాతం కింద ఆడుకుంటున్న ప్రజలు.. ఇంతలో ఏం జరిగిందంటే
గడ్డకట్టిన జలపాతం కింద ఆడుకుంటున్న ప్రజలు.. ఇంతలో ఏం జరిగిందంటే
అదృష్టం అంటే ఈ అమ్మడిదే గురూ.!
అదృష్టం అంటే ఈ అమ్మడిదే గురూ.!
ETF అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
ETF అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?