Anil Ravipudi : దానికి దీనికి అస్సలు సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి..

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. గతంలో వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్‌‌‌‌గా..

Anil Ravipudi : దానికి దీనికి అస్సలు సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి..
Anil
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 09, 2021 | 10:03 AM

Anil Ravipudi : టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. గతంలో వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్‌‌‌‌గా ఈ సినిమా రాబోతుందని మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వెంకీ-వరుణ్ తమ కామెడీ టైమింగ్‌‌‌‌‌‌తో అదరగొట్టారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌‌‌గా నటించారు. ఇదిలా ఉంటే అనీల్ ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న సినిమా ఎఫ్3 అనే టైటిల్‌‌ను ఫిక్స్ చేశారు అనిల్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే మొదటి నుంచి ఈ సినిమా ఎఫ్ 2కు సీక్వెల్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయం పై తాజాగా దర్శకుడి అనిల్ క్లారిటీ ఇచ్చారు. ఎఫ్2 కు ఎఫ్3 ఎలాంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు.

ఈ రెండు సినిమాల్లో కామన్‌‌‌గా ఒకపాయింట్ ఉంటుంది కానీ మెయిన్ పాయింట్ మాత్రం వేరే ఉంటుందని అనిల్ చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ మాట్లాడుతూ.. ఎప్ 3 కథ పూర్తిగా విభిన్నమైనది అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఎఫ్ 2 తరహాలోనే పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఎప్ 3 సినిమా లో కూడా హీరోలు ఇద్దరు పండించే కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండనుందని అనిల్ తెలిపాడు. అలాగే ఈ సినిమా సునీల్ తన కామెడీతో అలరిస్తారని తెలిపాడు అనిల్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata Blaster: పవర్ ప్యాక్ బ్లాస్టర్ వచ్చేసింది.. విశ్వరూపం చూపించిన ప్రిన్స్‌.. అభిమానులకు ఇక పండగే

సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. ఈషా అందాల ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..

Bigg Boss 5: బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ప్రేమ కావాలి బ్యూటీ..? క్లారిటీ ఇచ్చిన ఇషా చావ్లా..