AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata Blaster: పవర్ ప్యాక్ బ్లాస్టర్ వచ్చేసింది.. విశ్వరూపం చూపించిన ప్రిన్స్‌.. అభిమానులకు ఇక పండగే

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం కాస్త ముందుగానే వచ్చింది. సర్కారు వారి పాట బ్లాస్టర్ పేరుతో నెట్టింట్లో సంచలనాలు క్రియోట్ చేసేందుకు అభిమానులు కూడా సిద్ధమయ్యారు.

Sarkaru Vaari Paata Blaster: పవర్ ప్యాక్ బ్లాస్టర్ వచ్చేసింది.. విశ్వరూపం చూపించిన ప్రిన్స్‌.. అభిమానులకు ఇక పండగే
Sarkaru Vaari Paata Birthday Blaster
Venkata Chari
|

Updated on: Aug 09, 2021 | 1:39 AM

Share

Sarkaru Vaari Paata Blaster: సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కోసం ఆయన ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ ట్రెండ్ చేయాలని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అలాగే తన పుట్టిన రోజున అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందించాడు ప్రిన్స్ మహేష్ బాబు. అయితే, ఆగస్టు 9న ఉదయం తొమ్మిది గంటల. తొమ్మిది నిమిషాలకు మహేష్ నటిస్తున్న సర్కారువారి పాట టీజర్‌ను విడుదల చేయాల్సి ఉంది. కానీ, కొద్ది గంటలకు ముందే సర్కారు వారి పాట బ్లాస్టర్ అంటూ అర్థరాత్రి 12 గంటలకే విడుదల చేసి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది చిత్ర బృందం.

ఈ స్పెషల్ బ్లాస్టర్ విషయానికి వస్తే.. ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. అంటూ మహేష్ బాబు ఎంట్రీని అద్భుతంగా చూపించారు.  ‘ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ కేక పుట్టించేలా ఉంది. మొదట యాక్షన్ సీన్స్‌తోనే బ్లాస్టర్‌ను పేల్చేశారు చిత్ర యూనిట్. ‘ఇఫ్ యూ మిస్ ద ఇంట్రస్ట్.. యువిల్ గెట్ యువర్ డేట్’ అంటూ విలన్ గ్యాంగ్‌కి వార్నింగ్ ఇచ్చాడు. ఈ డైలాగ్ తరువాత మహేష్‌లోని యాక్షన్ కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించేలా చూపించారు. ఫైటింగ్‌లో మహేష్ సత్తాను మరోసారి రుచిచూపించారు.

అనంతరం హీరోయిన్ కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చి గ్లామర్‌ను యాడ్ చేశారు. ‘సర్ పడుకునే ముందు ప్రతిరోజు దిష్టి తీయడం మర్చిపోకండి’ అంటూ మహేష్ గ్లామర్ గురించి కీర్తి సురేష్ చెప్పడం బాగుంది. అనంతరం మహేష్‌లోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపిచడంతో పక్కనే ఉన్న వెన్నెల కిషోర్ ఆశ్చర్యపోయి చూస్తుండడం నవ్వులు తెప్పిస్తోంది.

ఇక చివరిగా ‘ఏమోయ్ కిషోర్.. ఓ ఐదారు మూరలు ఉండవవి’ అంటూ కీర్తి సురేష్ జడకు పెట్టుకున్న పూలపై పంచ్ అదిరిపోయేలా ఇచ్చి బ్లాస్టర్‌ను ముగించారు. మొత్తానికి పవర్ ప్యాక్డ్‌ బ్లాస్టర్ కట్ చేసి అభిమానులకు నిద్ర లేకుండా చేసింది. చిత్ర యూనిట్.

ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌‌‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మహేష్ అభిమానులు ఈ పోస్టర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఫస్ లుక్ పోస్టర్ తో రికార్డులు వేట మొదలు పెట్టింది సర్కారు వారి పాట. ఇక టీజర్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. తాజాగా ఈ సినిమా నుంచి చిన్న జిఫ్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ వీడియోలో నడుం బిగించి విలన్ల దుమ్ముదులపడానికి సిద్ధం అవుతున్నట్టు మహేష్ కనిపిస్తున్నాడు. ఈ జిఫ్ వీడియో సినిమా‌పై అంచనాలను మరింత పెంచింది.

బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌‌‌గా నటిస్తుంది. ఈ సినిమా మహేష్ సరికొత్త లుక్‌‌‌లో కనిపించనున్నాడు. లాంగ్ హెయిర్, మెడమీద ట్యాటూతో ఆకట్టుకుంటున్నాడు మహేష్. భారీ బ్యాంక్ కుంభకోణంలో ఇరుక్కున్న తండ్రిని కాపాడే కొడుకుగా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌‌‌తోపాటు అదిరిపోయే కామెడీ కూడా ఉంటుందని తెలుస్తోంది.

Also Read: సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. ఈషా అందాల ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో ఎన్టీఆర్‌ తలకు గాయమైందా..? అభిమాని ప్రశ్నకు స్పందించిన చిత్ర యూనిట్‌.