AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: సలార్ బ్యూటీకి సర్‌ప్రైజ్ ఇచ్చిన పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్.. ‘డార్లింగ్’ ఎపుడూ ఇంతే అంటోన్న నెటిజన్లు

రెబల్ స్టార్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు సలార్ బ్యూటీ శృతిహాసన్‌ థ్రిల్ అయిందంట. ఈ మేరకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

Prabhas: సలార్ బ్యూటీకి సర్‌ప్రైజ్ ఇచ్చిన పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్.. 'డార్లింగ్' ఎపుడూ ఇంతే అంటోన్న నెటిజన్లు
Prabhas And Sruthihasan
Venkata Chari
|

Updated on: Aug 09, 2021 | 5:12 AM

Share

Prabhas: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, శృతిహాసన్‌ హీరోహీరోయిన్లుగా రూపొందిచస్తున్న సినిమా సలార్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమానుంచి అప్‌డేట్ల కోసం డార్లింగ్ ఫ్యా్న్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఓ విషయంలో ప్రభాస్ నెట్టిట్లో హాట్ టాపిక్‌గా మారాడు. ప్రభాస్ సెట్‌లో ఉంటే యూనిట్ సభ్యులందరికీ వెరైటీ వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేస్తుంటాడని మనం తరచుగా వింటూనే ఉన్నాం. ఆమధ్య బాహుబలి షూటింగ్‌లో అనుష్క, రానా, తమన్నాల కోసం పలు వెరైటీలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అలాగే సాహో షూటింగ్ సమయంలోనూ శ్రద్ధా కపూర్‌ కోసం స్పెషల్ వంటలు చేయించాడు కూడా. అయితే ఈ సారి ఆ లిస్టులో సలార్ క్వీన్ శృతిహాసన్‌ చేరింది.

Prabhas Special Food For Sruthihasan1

హీరోయిన్ శృతిహాసన్‌ కోసం దాదాపు 20 వెరైటీ వంటకాలతో విందును ఏర్పాటు చేసి షాక్ ఇచ్చాడంట ప్రభాస్. స్పెషల్‌గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర మాంసం, కబాబ్, పలురకాల పప్పులు, సాంబార్, కర్రీ ఇలా దాదాపు 20 రకాల వంటకాలను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. శృతిహాసన్‌ కోసం వండించి సెట్‌లోకి తీసుకొచ్చారంట. ఈ మేరకు ఈ లిస్ట్‌ను శృతిహాసన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌‌ స్టోరీస్‌లో పంచుకుంది. రెబల్ స్టార్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు సలార్ బ్యూటీ శృతిహాసన్‌ థ్రిల్ అయిందంట. ఈ మేరకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. కాగా, ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారింది.

Prabhas Special Food For Sruthihasan

కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకతంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో డార్లింగ్ మాఫియా డాన్‌‌‌‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కేజీఎఫ్‌‌‌‌ని నిర్మించిన హోంబలే సంస్థ ఈ సినిమానూ నిర్మిస్తోంది. ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోంది. అదేవిధంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Also Read: సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. ఈషా అందాల ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..

Bigg Boss 15 OTT launch Highlights: బాలీవుడ్‌లో మొదలైన బిగ్ బాస్ సందడి.. తొలివారం నామినేషన్ ఎవరంటే?