AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Payal Rajput: కన్నడలో పాగా వేయడానికి సిద్ధమైన అందాల ముద్దుగుమ్మ.. హెడ్‌ బుష్‌తో రానున్న పాయల్‌.

Payal Rajput: 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో కుర్రకారును మెస్మరైజ్‌ చేసింది. అనంతరం...

Payal Rajput: కన్నడలో పాగా వేయడానికి సిద్ధమైన అందాల ముద్దుగుమ్మ.. హెడ్‌ బుష్‌తో రానున్న పాయల్‌.
Payal Rajput
Narender Vaitla
|

Updated on: Aug 09, 2021 | 6:41 AM

Share

Payal Rajput: ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో కుర్రకారును మెస్మరైజ్‌ చేసింది. అనంతరం పలు పంజాబి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తోంది. నిజానికి పాయల్‌ తొలి చిత్రం చూసిన తర్వాత బడా ఆఫర్లు క్యూ కడతాయని అంతా భావించినా ఆశించిన స్థాయిలో మాత్రం ఆఫర్లు రాలేదని చెప్పాలి. అయితే తమిళంలోనూ ఓ చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందీ బ్యూటీ.

ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమాలో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మరో ఆఫర్‌ను సొంతం చేసుకుంది. దీంతో పాయల్‌ మరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ధనుంజయ హీరోగా తెరకెక్కుతోన్న ‘హెడ్‌ బుష్‌’ అనే చిత్రంతో పాయల్‌ కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా షూటింగ్‌ నేటి నుంచి (సోమవారం) బెంగళూరులో ప్రారంభమవుతోంది. ఓ డాన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. 1960-80ల మధ్య సాగే కథాంశంతో ఈ సినిమా ఉండనుందని సమాచారం. బెంగళూరుతో పాటు, మైసూర్‌, కోలార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది. మరి తెలుగు ప్రేక్షకులను తన అందంతో కట్టి పడేసిన పాయల్‌ రాజ్‌పుత్‌.. కన్నడ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: గూగుల్ నుంచి డిలీట్ చేసిన ఫొటోలు కావాలా.. అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..!

Viral Video: గూడుపై దాడిచేయబోయిన పాము.. అడ్డుపడిన పక్షి.. ఏంజరిగిందంటే? వైరలవుతోన్న వీడియో

Prabhas: సలార్ బ్యూటీకి సర్‌ప్రైజ్ ఇచ్చిన పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్.. ‘డార్లింగ్’ ఎపుడూ ఇంతే అంటోన్న నెటిజన్లు

ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.10 లక్షలు.. దరఖాస్తులకు అవకాశం
ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.10 లక్షలు.. దరఖాస్తులకు అవకాశం
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..