AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గూడుపై దాడిచేయబోయిన పాము.. అడ్డుపడిన పక్షి.. ఏంజరిగిందంటే? వైరలవుతోన్న వీడియో

పాములు ఏ పక్షినైనా సులభంగా తమ ఆహారంగా చేసుకోగలవని మనందరికీ తెలుసు. చాలా పక్షులు వాటికి దూరంగా ఉండటం మంచిదని భావించడానికి కారణం ఇదే.

Viral Video: గూడుపై దాడిచేయబోయిన పాము.. అడ్డుపడిన పక్షి.. ఏంజరిగిందంటే? వైరలవుతోన్న వీడియో
Snake And Bird
Venkata Chari
|

Updated on: Aug 09, 2021 | 5:39 AM

Share

Viral Video: నేటి కాలంలో సోషల్ మీడియా ప్రజలకు ఒక మాధ్యమంగా మారింది. దీంట్లో వారు సరదా విషయాలను పంచుకుంటుంటారు. వీటిలో కొన్నింటిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అదే సమయంలో కొన్ని వీడియోలు షాకిస్తుంటాయి. తాజాగా ఓ పాము, పక్షి వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. ఆ వీడియోను చూసి మీరు కచ్చితంగా పక్షిని మెచ్చుకుంటారనడంలో సందేహం లేదు. పాములు ఏ పక్షినైనా సులభంగా తమ ఆహారంగా చేసుకోగలవని మనందరికీ తెలుసు. చాలా పక్షులు వాటికి దూరంగా ఉండటం మంచిదని భావించడానికి కారణం ఇదే. కానీ, పాము ప్రతిసారీ విజయం సాధించలేదు. కొన్నిసార్లు రిక్త హస్తాలే మిగులుంటాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో అది చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ఒక పక్షి పర్వతంపై నిర్మించిన గూడులోకి ప్రవేశించడానికి ఓ పాము ప్రయత్నిస్తుంటుంది. అడ్డుపడిన పక్షిపై విషపూరిత పాము దాడి చేసినట్లు వీడియోలో చూడవచ్చు. పాముపై దాడి చేసేందుకు వెళ్లిన పక్షిని.. అమాంతం పాము తన నోటితో పట్టుకుంటుంది. కానీ పక్షి తన ప్రాణాలను కాపాడటానికి చాలా ధైర్యంగా పోరాడింది. పాముకి ఆహారం కాకుండా తప్పించుకుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను చాలా ఆశ్చర్యపరుస్తోంది. ప్రజలు ఈ వీడియో క్లిప్‌ను ఒకరితో ఒకరు పంచుకోవడమే కాకుండా దానిపై పలు రకాల కామెంట్లు కూడ చేస్తున్నారు. పక్షి ధైర్యాన్ని మెచ్చుంకుంటున్నారు.

Also Read:  Viral Video: అదిరేటి స్టెప్పులతో అదరగొట్టిన పోలీస్.. ‘వావ్, వాటే’ గ్రేస్ అంటోన్న నెటిజన్స్

Viral Video: ఫాంటా కూల్ డ్రింక్ పోసి ఆమ్లెట్ వేసాడు.. వీడి క్రియేటివిటీ తగలెయ్యా.. ఇదేమి వెరైటీ ఫుడ్ రా సామి..