Viral Video: మలుపు తిరుగుతున్న కారు.. వేగంగా వచ్చి స్కూటీతో ఢీకొట్టిన మహిళ.. తర్వాత ఏమైందో తెలుసా? ఒళ్లు గగుర్పొడిచే వీడియో
రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ చూసి మీరు షాక్ అవుతారు. ఈ వీడియో చూసిన తర్వాత, మీరు రోడ్డుపై జాగ్రత్తగా డ్రైవ్ చేయడమే కాకుండా, డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం మర్చిపోకుండా ఉంటారు.
Viral Video: ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. కొన్నిసార్లు ప్రజల మూర్ఖత్వం కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు అవి అనుకోకుండా జరుగుతాయి. రోడ్డు, రైలు, విమాన ప్రమాదాల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి గుండెను పిండేసేలా ఉంటాయి. అయితే ఇటీవల ఓ రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ చూసి మీరు షాక్ అవుతారు. ఈ వీడియో చూసిన తర్వాత, మీరు రోడ్డుపై జాగ్రత్తగా డ్రైవ్ చేయడమే కాకుండా, డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ కూడా ధరించడం మర్చిపోరు.
ప్రమాద వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సచిన్ కౌశిక్ అనే ఉత్తర ప్రదేశ్ పోలీసు ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వీడియోలో అమ్మాయికి జరిగిన ఘోర ప్రమాదం చూసి, మీ శ్వాస ఆగిపోతుంది. వీడియోలో, రోడ్డుపై ఓ కారు ముందుకు వెళ్తుంటుంది. దాని వెనుకాలే స్కూటీ నడుపుతున్న అమ్మాయి వస్తుంటుంది. అయితే కారు అకస్మాత్తుగా మరోవైపు తిరుగుంది. దీంతో వేగంగా వస్తున్న అమ్మాయి కారును బలంగా ఢీకొని, జంపింగ్ చేస్తున్నట్లుగా కారుమీది నుంచి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీ టైర్ ప్లేట్లు ఊడి బయటకు వచ్చాయి. ప్రమాదం పెద్దదే. కానీ, అమ్మాయికి తీవ్రమైన దెబ్బలు తగలకుండా బయటపడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డయింది.
స్కూటీ, కారును అత్యంత వేగంగా వచి ఢీకొంటుంది. అదృష్టవశాత్తూ, ఆ అమ్మాయి హెల్మెట్ ధరించింది. దాని కారణంగా ఆమె ప్రాణాలు దక్కాయి. ఆమె హెల్మెట్ ధరించకపోయి ఉంటే తలకు బలమైన గాయం అయ్యే అవకాశం ఉంది. వీడియోను పంచుకుంటూ, సచిన్ కౌశిక్ ‘కేవలం రూ. 900 లో జీవితాన్ని పొందవచ్చు. హెల్మెట్ కచ్చితంగా ధరించండి’ అనే క్యాప్షన్‌లో రాశారు.
ఈ గగుర్పాటు వీడియోను చూసి సోషల్ మీడియాలో ప్రజలు షాక్ అవుతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 60 వేలకు పైగా ప్రజలు చూశారు. ప్రజలు ఈ వీడియో క్లిప్‌ను ఒకరితో ఒకరు పంచుకోవడమే కాకుండా దానిపై పలు రకాల కామెంట్లు కూడ చేస్తున్నారు. ఈ వీడియోను చూసి హెల్మెట్ విలువను అర్థం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
मात्र 900 रुपए में कुछ मिले ना मिले, ‘जीवन’ ज़रूर मिलता है।#WearHelmet #HelmetSavesLife #Accident pic.twitter.com/VCypokvs4M
— SACHIN KAUSHIK (@upcopsachin) August 6, 2021
Also Read: Viral Video: అదిరేటి స్టెప్పులతో అదరగొట్టిన పోలీస్.. ‘వావ్, వాటే’ గ్రేస్ అంటోన్న నెటిజన్స్