AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫాంటా కూల్ డ్రింక్ పోసి ఆమ్లెట్ వేసాడు.. వీడి క్రియేటివిటీ తగలెయ్యా.. ఇదేమి వెరైటీ ఫుడ్ రా సామి..

వీడి క్రెయేటివిటీ తగలెయ్యా.. బ్రెడ్‌ ఆమ్లెట్‌‌లో ఏకంగా ఫాంటా పోసి వెరైటీ ఫుడ్ తయారు చేశాడు. దీనిని వీడియో తీసి నెట్టింట్లో పెట్టడంతో వైరల్‌గా మారింది.

Viral Video: ఫాంటా కూల్ డ్రింక్ పోసి ఆమ్లెట్ వేసాడు.. వీడి క్రియేటివిటీ తగలెయ్యా.. ఇదేమి వెరైటీ ఫుడ్ రా సామి..
Fanta Amlet
Venkata Chari
|

Updated on: Aug 08, 2021 | 4:34 AM

Share

Viral Video: వీడి క్రియేటివిటీ తగలెయ్యా.. మనం ఆమ్లెట్‌ను ఎలా తయారు చేస్తాం..? ఎగ్‌లో కొద్దిగి కారం, ఉప్పు వేసి ఆమ్లెట్‌లా వేస్తాం. కానీ, ఈ వీడియోలో ఒకతను మాత్రం ఆమ్లెట్‌‌లో ఏకంగా ఫాంటా పోసి వెరైటీ ఫుడ్ తయారు చేశాడు. దీనిని వీడియో తీసి నెట్టింట్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా అల్పాహారం కోసం రొట్టె లేదా ఆమ్లెట్ చేసుకుని తినడం చాలా మందికి అలవాటు. ఇవి సిద్ధం చేయడం కూడా చాలా సులభం. అలాగే ఎంతో రుచికరమైనది కూడా. బ్రెడ్, గుడ్లతో సహా పలు రకాల అల్పాహారాలను తయారుచేస్తూ గుజరాత్‌లోని సూరత్ నగరంలోని ఓ దుకాణం ఆకట్టుకుంటోంది. వీళ్ల ప్రత్యేకత ఏంటంటే.. ఆమ్లెట్‌ను ఫాంటాతో కలిపి తయారుచేయడం. అవును, మీరు సరిగ్గానే విన్నారు! సూరత్‌లోని ఒక ఫుడ్ బ్లాగర్ ఫాంటా ఆమ్లెట్‌ను రూ .250 కి విక్రయించే దుకాణానికి వెళ్లి.. పూర్తి వివరాలతో ఓ వీడియోను నెట్టింట్లో విడుదల చేశాడు. ఇండియా ఈట్ మానియాలో ఈ వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియోలో ఫాంటా ఆమ్లెట్ తయారు చేసే విధానాన్ని చూపించాడు.

దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇండియన్‌ ఈట్‌ మానియా’ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్టు చేసిన ఈ వీడియో.. ఇప్పటికే 87,000 మంది చూశారు. కాగా నెటిజన్లు తమ ఫన్నీ కామెంట్లతో ఆకట్టుకుంటున్నారు. ఈ కొత్త కాంబినేషన్‌ను టేస్ట్‌ చేయాల్సిందేనని ఒకరు కామెంట్ చేయగా, ఇంత రేటు పెట్టి ఈ వెరైటీ వంటకాన్ని తినడం అవసరమా అంటూ మరొకరు కామెంట్ చేశారు. అసలు వేడివేడి ఆమ్లెట్‌లో చల్లని ఫాంటా పోయాలన్న నీ ఆలచోనకు దండంరా బాబు అంటూ కొందరు కామెంట్లు చేశారు. మొత్తానికి ఈవీడియో ప్రస్తుతం నెట్టింట్లో దూసుకపోతోంది.

ఈ వీడియోను మీరూ చూడండి..

Also Read:

Follow Us
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన