AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lionel Messi: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్.. ఎందుకో తెలుసా? వైరలవుతోన్న వీడియో

స్పానిష్ ఫుట్‌బాల్‌ క్లబ్ బార్సిలోనాను వదిలి వెళ్తానని ఊహించ‌లేదంటూ స్పానిష్ ఫుట్‌డాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ భావోద్వేగానికి గురయ్యాడు. బార్సిలోనాతో రెండు ద‌శాబ్దాల అనుబంధాన్ని..

Lionel Messi: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్.. ఎందుకో తెలుసా? వైరలవుతోన్న వీడియో
Lionel Messi
Venkata Chari
| Edited By: |

Updated on: Aug 09, 2021 | 7:09 AM

Share

Lionel Messi: స్పానిష్ ఫుట్‌బాల్‌ క్లబ్ బార్సిలోనాను వదిలి వెళ్తానని ఊహించ‌లేదంటూ స్పానిష్ ఫుట్‌డాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ భావోద్వేగానికి గురయ్యాడు. బార్సిలోనాతో రెండు ద‌శాబ్దాల అనుబంధాన్ని ఆదివారం తెంచుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. స్పానిష్ ఫుట్‌బాల్‌ క్లబ్ బార్సిలోనాకు ఫేర్‌వెల్ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యాడు. కెరీర్‌ అయిపోయేంత వరకు బార్సిలోనాతోనే ఉండాలని అనుకున్నానని, కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకోవాల్సి వస్తుందని తెలిపాడు. మ‌రలా నేను స్పానిష్ ఫుట్‌బాల్‌ క్లబ్ బార్సిలోనాలోకి తిరిగి వ‌స్తానంటూ పేర్కొన్నాడు. తన కెరీర్ బార్కాలోనే మొదలైందని, ఇక్కడి నుంచే చాలా నేర్చుకున్నానని వెల్లడించాడు. నేడు ఈ స్థాయిలో ఉండేందుకు కారణం బార్కానే అని లియోనల్ మెస్సీ కన్నీటి పర్వంతమయ్యాడు.

కాగా, స్పానిష్ ఫుట్‌బాల్‌ క్లబ్ బార్సిలోనా ఆర్థిక ప‌రిస్థితి పడిపోవడంతో మెస్సీతో కాంట్రాక్ట్‌ ముగిస్తున్నట్లు గురువారం బార్సిలోనా ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. మెస్సీ 17 సీజ‌న్ల పాటు బార్సిలోనాతోనే మ్యాచులు ఆడారు. ఆ క్లబ్ త‌ర‌ఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రికార్డులు నెలకొల్పాడు. 2000 సంవత్సరంలో 13 ఏళ్ల వ‌య‌సులో ఈ క్లబ్ తరుపున మెస్సీ కెరీర్ ప్రారంభమైంది.

అయితే మెస్సీ 17 ఏళ్ల వయసులో 2004 నుంచి మ్యాచులు ఆడడం మొదలు పెట్టాడు. మొత్తం 17 సీజన్లు ఆడాడు. ఈ సమయంలోనే క్లబ్ తరఫున 778 మ్యాచ్‌లు ఆడి 672 గోల్స్‌ సాధించాడు. మెస్సీ క్లబ్‌ను వీడటంతో చాలా నష్టం వాటిల్లనుంది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నష్టాన్ని పూరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. మెస్సీ హయంలోనే ఎఫ్‌సీ బార్సిలోనే ఎన్నో టైటిళ్లను సొంతం చేసుకుంది. లా లిగా-10, కోపా డెల్ రే-7, ఛాంపియన్స్ లీగ్-4, ఫుట్‌బాల్ వరల్డ్ కప్-3లను సాధించింది. మెస్సీ 20 సార్లు టాప్ స్కోరర్‌గా నిలిచి పలు రికార్డులను బద్దలు కొట్టాడు. 6 సార్లు బాల్లన్ డీ ఆర్‌ను అందుకున్న ఆటగాడిగా మెస్సీ పేరుగాంచాడు. అయితే, మరో స్టార్ స్ట్రైకర్ సెర్గియో కూడా బార్సిలోనాను వీడనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Also Read: IND vs ENG 1st Test Match: టీమిండియా గెలుపును అడ్డుకున్న వర్షం.. డ్రా గా ముగిసిన తొలి టెస్ట్‌..

IND vs ENG 1st Test Highlights: భారత్‌ గెలుపుపై నీళ్లు చల్లిన వరుణుడు.. తొలి టెస్ట్‌ వర్షార్పణం.. డ్రా ముగిసిన మ్యాచ్‌.

సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.