IND vs ENG 1st Test Match: టీమిండియా గెలుపును అడ్డుకున్న వర్షం.. డ్రా గా ముగిసిన తొలి టెస్ట్‌..

IND vs ENG 1st Test Match: భారత్‌ - ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి టెస్ట్‌ డ్రా గా ముగిసింది. టీమిండియా విజయం దాదాపు ఖరారైందని అంతా భావించిన తరుణంలో వర్షం...

IND vs ENG 1st Test Match: టీమిండియా గెలుపును అడ్డుకున్న వర్షం.. డ్రా గా ముగిసిన తొలి టెస్ట్‌..
India Vs Eng Match
Follow us

|

Updated on: Aug 08, 2021 | 9:29 PM

IND vs ENG 1st Test Match: భారత్‌ – ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి టెస్ట్‌ డ్రా గా ముగిసింది. టీమిండియా విజయం దాదాపు ఖరారైందని అంతా భావించిన తరుణంలో వర్షం ఆశలను ఆడియాలు చేసింది. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ ఆగిపోయింది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చివరి సెషన్‌ వరకు వేచి చూసిన అంప్లైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 157 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉండగా భారత్‌ విజయాన్ని వరుణుడు అడ్డుకున్నట్లైంది. ఇక భారత్‌ – ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 52/1తో నిలిచింది. రోహిత్‌ శర్మ(12), పుజారా(12) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు కేఎల్‌ రాహుల్‌(26) ధాటిగా ఆడుతూ బ్రాడ్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో భారత్‌ 34 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ 84 ( 214 బంతుల్లో 12 ఫోర్లు), రవీంద్ర జడేజా 56 ( 86 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఇక చివర్లో జస్ప్రిత్‌ బుమ్రా 28 (34 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) ధాటిగా ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రాబిన్‌సన్‌ 5, అండర్సన్‌ 4 వికెట్లతో పడొట్టారు.

Also Read: TTD: శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కేసులో రెండో ఛార్జ్ షీట్ పరిస్థితేంటి? ఎంత వరకూ వచ్చింది?

Mony Mint: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ ఫోన్‌.. ఏటీఎం కార్డ్‌ అంత సైజ్‌. అలా అనీ ఫీచర్లు తక్కువేం లేవు.

Shoking: అత్యంత దారుణం.. పూర్తిస్థాయి నిర్లక్ష్యం.. అకారణంగా గాల్లో దీపాల్లా మారిన రెండు ప్రాణాలు.. రోడ్ యాక్సిడెంట్ షాకింగ్ వీడియో

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ