- Telugu News Photo Gallery Technology photos China mobile company mony introducing worlds smallest smartphone with size of atm card
Mony Mint: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్.. ఏటీఎం కార్డ్ అంత సైజ్. అలా అనీ ఫీచర్లు తక్కువేం లేవు.
Mony Mint: చైనాకు చెందిన మోనీ అనే కంపెనీ ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. మింట్ పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 3 అంగుళాలు మాత్రమే ఉండడం విశేషం...
Updated on: Aug 08, 2021 | 9:09 PM

చైనాకు చెందిన మోనీ అనే కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ అతి చిన్న స్మార్ట్ ఫోన్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

మింట్ పేరుతో రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్ పరిమాణం కేవలం 3 అంగుళాలు మాత్రమే ఉండడం విశేషం. అంటే మనం ఉపయోగించే ఏటీఎం కార్డు సైజంత అన్నమాట.

ఈ స్మార్ట్ ఫోన్ ధర 150 డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 11,131. అయితే ఈ ఫోన్‌ను ఇప్పుడు ఆర్డర్ చేస్తే నవంబర్‌లో వస్తుంది.

దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 4జీ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ 1.5GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఇందులో 3జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. అంతేకాకుండా 128 జీబీ వరకు స్టోరేజ్ పెంచుకునే అవకాశం కలిపించారు.

కెమెరా విషయానికొస్తే.. 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.




