Bangladesh vs Australia: బంగ్లా బౌలర్‌కు చుక్కలు చూపించిన ఆర్‌సీబీ ఆల్‌రౌండర్.. ఒకే ఓవర్లో 5 సిక్సులతో సునామీ..!

బంగ్లాదేశ్‌తో జరిగిన నాలుగో టీ20లో ఆస్ట్రేలియా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ డానియల్ క్రిస్ట్రియన్ చెలరేగిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్ టీంను గడగడలాడించాడు. షకీబ్ అల్ హసన్‌ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు.

Bangladesh vs Australia: బంగ్లా బౌలర్‌కు చుక్కలు చూపించిన ఆర్‌సీబీ ఆల్‌రౌండర్.. ఒకే ఓవర్లో 5 సిక్సులతో సునామీ..!
Australia Player And Rcb All Rounder Dan Christian
Follow us
Venkata Chari

|

Updated on: Aug 09, 2021 | 2:11 AM

Bangladesh vs Australia: బంగ్లాదేశ్‌తో జరిగిన నాలుగో టీ20లో ఆస్ట్రేలియా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ డానియల్ క్రిస్ట్రియన్ చెలరేగిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్ టీంను గడగడలాడించాడు. షకీబ్ అల్ హసన్‌ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు. ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాది దుమ్ము దులిపాడు. అయితే మరో సిక్స్ కొట్టి ఉంటే మాత్రం.. ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్, హెర్షెల్ గిబ్స్, కీరన్ పొలార్డ్, సోబెర్స్ సరసన చేరేవాడు. ఈ అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. క్రిస్ట్రియన్(15 బంతుల్లో 39; ఫోర్‌, 5 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో నాలుగో టీ20 ఆసీస్‌ 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మూడవ టీ20లో తడబడిన డానియల్ క్రిస్టియన్ నాలుగో టీ20లో విరుచపడ్డాడు. అయితే ఐదు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే బంగ్లాదేశ్ 3-1తో కైవసం చేసుకుంది. కాగా, బంగ్లాదేశ్‌ తొలిసారి ఆస్ట్రేలియాపై సిరీస్ విజయాన్నందుకుని రికార్డులను బద్దలు కొట్టింది.

నాలుగో టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన డానియల్ క్రిస్టియన్.. షకీబ్ అల్ హసన్‌కు చుక్కలు చూపించాడు. తొలి బంతిని స్టెప్ ఔటై లాంగాన్ దిశగా సిక్సర్ బాదేశాడు. ఇక రెండవ బంతిని వైడ్ లాంగ్ ఆన్ దిశకు చేర్చాడు. మూడో బంతిని స్లాగ్ స్వీప్ షాట్‌తో డీప్ మిడ్ వికెట్‌ మీదుగా మైదానం అవతల పడేసి హ్యాట్రిక్ సిక్సర్ బాదేశాడు. అప్పటికే షకీబ్ అల్ హసన్ మొహం మాడిపోయింది. అయితే నాలుగో బంతిని షకీబ్ తెలివిగా ఔట్‌సైడ్ ఆఫ్‌‌ స్టాంప్ దిశగా వేశాడు. ఈ బంతిని బౌండరీ తరలించడంలో క్రిస్టియన్ విఫలమయ్యాడు. దాంతో నాలుగో బంతి డాట్‌గా మిగిలిపోయింది. ఐదో బంతిని లాంగాన్ దిశగా భారీ మలిచి మరలా ఓ సిక్సర్ బాదేశాడు. ఇక చివరి బంతిని ఓవర్ డీప్ మిడ్‌ వికెట్‌ మీదుగా బౌండరీ దాటించాడు. ఈ ఓవర్‌లో 30 పరుగులు వచ్చాయి. అనంతరం ఆ జోరును కొనసాగించలేక ముస్తాఫిజుర్ బౌలింగ్‌లోనే క్రిస్టియన్ పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షో కనబర్చిన ఆసీస్.. 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుస పరాజయాలకు మాత్రం బ్రేక్ వేసుకోగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 104 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ నైమ్(28), హోస్సెన్(23), మెహ్‌దీ హసన్(23) టాస్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆండ్రూటై, మిచెల్ స్వెప్సన్ చెరో మూడు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్ 2, అష్టన్ అగర్ ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా19 ఓవర్లలో 7 వికెట్లకు 105 పరుగులు చేసి 6 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది.

Also Read: IND vs ENG 1st Test Match: టీమిండియా గెలుపును అడ్డుకున్న వర్షం.. డ్రా గా ముగిసిన తొలి టెస్ట్‌..

Tokyo Olympics 2021: విశ్వక్రీడల్లో భారత త్రివర్ణ పతకానికి పసిడి, రజత, కాంస్య రంగులు అద్దిన క్రీడాకారులు..

2024లో Swiggyలో అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తులు.. వీటికి ఇంత డిమాం
2024లో Swiggyలో అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తులు.. వీటికి ఇంత డిమాం
9మంది గుట్టుగా చేరి పని మొదలుపెట్టారు.. పోలీసుల ఎంట్రీతో..
9మంది గుట్టుగా చేరి పని మొదలుపెట్టారు.. పోలీసుల ఎంట్రీతో..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
నోరూరించే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.. ఈజీగా చేసేయండి!
నోరూరించే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.. ఈజీగా చేసేయండి!
ఈ ఆకు రోజూ పిడికెడు తింటే చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
ఈ ఆకు రోజూ పిడికెడు తింటే చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
వెంకీ విత్ బాలయ్య అన్‌స్టాపబుల్.. ఎపిసోడ్ లో హైలెట్స్.!
వెంకీ విత్ బాలయ్య అన్‌స్టాపబుల్.. ఎపిసోడ్ లో హైలెట్స్.!
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..