ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు.. కానీ కుటుంబ పోషణ కోసం రోజు రూ.250 కూలీ..
టోక్యో ఒలింపిక్స్‌లో దేశం కోసం పతకాలు సాధించిన ఆటగాళ్లపై ప్రభుత్వాలు, సంస్థలు భారీగా డబ్బుల వర్షం కురిపిస్తున్నాయి. దేశానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చేయడంతోపాటు పెద్ద ఒప్పందాలపై సంతకాలు
టోక్యో ఒలింపిక్స్‌లో దేశం కోసం పతకాలు సాధించిన ఆటగాళ్లపై ప్రభుత్వాలు, సంస్థలు భారీగా డబ్బుల వర్షం కురిపిస్తున్నాయి. దేశానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చేయడంతోపాటు పెద్ద ఒప్పందాలపై సంతకాలు చేసుకుంటున్నాయి. కానీ మిగతా ఆటగాళ్లను మాత్రం విస్మరిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని పెంచిన చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు కానీ నేడు వారు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ కోసం కూలీలుగా మారుతున్నారు. దేశంలో ఎంతోమంది టాలెంట్ ఉన్న క్రీడాకారులను మాత్రం ఎవ్వరు గుర్తించడం లేదు.
130 కోట్లు ఉన్న భారత జనాభాలో ఎన్ని ఒలింపిక్ పతకాలు వస్తున్నాయనేది అందరు ఆలోచించాల్సిన ప్రశ్న. అందులో ఎన్ని బంగారు పతకాలు ఉంటున్నాయో కూడా అందరికి తెలుసు. సరైన క్రీడాకారులను సరైన సమయంలో గుర్తించి ప్రోత్సాహం అందిస్తే భారతదేశం కూడా పతకాల పట్టికలో ప్రపంచదేశాలోత పోటీ పడుతుంది. గ్రామీణ భారతంలో ప్రతిభ ఉన్న ఎంతోమంది క్రీడాకారులు కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించినవారికి కూడా గుర్తింపు లేకుండా పోతుంది. తాజాగా టీమిండియా కోసం ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఓ క్రికెటర్ ఇప్పుడు కూలీ చేసుకోవడం చాలా బాధాకరం.
2018 బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలో పాల్గొన్న నరేష్ తుమ్దా అనే వ్యక్తి చాలా దుర్భర పరిస్థితిలో ఉన్నాడు. గుజరాత్‌లోని నవసారికి చెందిన ఈ అంధ క్రికెటర్ ప్రపంచ కప్ విజేత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం. 2018 మార్చిలో షార్జా స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్ 308 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించిన జట్టులో సభ్యుడు.నరేష్ తన కుటుంబాన్ని పోషించడానికి కూలీ పనిచేస్తున్నాడు. నవ్‌సారీలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. “నేను రోజుకు రూ.250 సంపాదిస్తాను. ముఖ్యమంత్రిని మూడుసార్లు అభ్యర్థించినా ఎలాంటి సమాధానం రాలేదు. నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను ” అని నరేశ్ వాపోయారు.
Gujarat: Naresh Tumda, part of team that helped India win 2018 Blind Cricket World Cup, now works as a labourer in Navsari to earn livelihood
“I earn Rs 250 a day. Requested CM thrice but didn’t get reply. I urge govt to give me job so that I can take care of my family,” he said pic.twitter.com/NK4DFO6YYC
— ANI (@ANI) August 8, 2021