Bangladesh vs Australia: బంగ్లా దెబ్బకు ఆస్ట్రేలియా చెత్త రికార్డు.. వరుసగా రెండో సిరీస్‌లో ఓటమి

ఆస్ట్రేలియా జట్టు దారుణ పరాజయాన్ని చవి చూసింది. సీనియర్లంతా గైర్హాజరు కావడంతో.. అనుభవం లేని కొత్త ఆటగాళ్లతో బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా.. సీరిస్ ఓటమితో పర్యటనను ముగించింది.

Bangladesh vs Australia: బంగ్లా దెబ్బకు ఆస్ట్రేలియా చెత్త రికార్డు.. వరుసగా రెండో సిరీస్‌లో ఓటమి
Bangladesh Vs Australia
Follow us
Venkata Chari

|

Updated on: Aug 10, 2021 | 8:21 AM

Bangladesh vs Australia: ఆస్ట్రేలియా జట్టు దారుణ పరాజయాన్ని చవి చూసింది. సీనియర్లంతా గైర్హాజరు కావడంతో.. అనుభవం లేని కొత్త ఆటగాళ్లతో బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా.. సీరిస్ ఓటమితో పర్యటనను ముగించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచులో 4–1తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా కేవలం 62 పరుగులకే చేతులెత్తేసింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆ్రస్టేలియాకిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అంతకుముందు 2005లో ఇంగ్లండ్‌పై చేసిన 79 పరుగులు అత్యల్ప స్కోరుగా ఉంది. బంగ్లా మ్యాచుతో అత్యల్ప స్కోరును నమోదు చేసి ఆస్ట్రేలియా చరిత్రలో ఓ చెత్త రికార్డును చేర్చింది.

టీ20ల్లో ఆసీస్‌కు ఇది వరుసగా రెండో సిరీస్‌‌లో ఓడిపోయింది. గత నెలలో వెస్టిండీస్ చేతిలో ఆస్ట్రేలియా 1–4తో ఓడి సిరీస్ కోల్పోయింది. ఈ మ్యాచు విషయానికి వస్తే.. తొలుత బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగుల చేసింది. బంగ్లా బ్యాట్స్‌న్లలో మొహమ్మద్‌ నైమ్‌ 23 పరుగులు (23 బంతులు; 1 ఫోర్, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆ్రస్టేలియా 13.4 ఓవర్లలో కేవలం 62 పరుగులకు చాప చుట్టేసింది. ఆసీస్ ప్లేయర్లలో సారథి వేడ్‌ 22 పరుగులు (22 బంతులు; 2 సిక్స్‌లు), బెన్‌ మెక్‌డెర్మట్‌17 పరుగులు (16 బంతులు; 1 సిక్స్‌) మినహా మిగతా బ్యాట్స్‌మెన్స్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరడం విశేషం. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షకీబుల్‌ హసన్‌ (4/9), సైఫుద్దీన్‌ (3/12) ఆసీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా షకీబ్ ఎన్నికయ్యాడు. ఏడు వికెట్లతో పాటు 114 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో షకీబ్‌ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో లసిత్‌ మలింగ (107) తొలిస్థానంలో నిలిచాడు.

Also Read: Neeraj Chopra: బంగారు పతకం ముందు బాధలన్నీ చిన్నవే: నీరజ్ చోప్రా

ఒలంపిక్స్‌లో భారత్‌ అదుర్స్‌…కేంద్ర మంత్రి రిజిజ్‌ ఏం చేశారో తెలుసా.? వైరల్ అవుతున్న వీడియో:Kiren Rijiju Video.

Olympic winners: టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులకు దేశం జైజేలు.. పతక విజేతలకు కేంద్రం ఘన సన్మానం..చిత్రాలు