Neeraj Chopra: బంగారు పతకం ముందు బాధలన్నీ చిన్నవే: నీరజ్ చోప్రా

టోక్యో ఒలింపిక్స్ 2020లో చరిత్ర సృష్టించిన ప్రదర్శన తర్వాత తన శరీరం చాలా నొప్పి చేసిందని ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా వెల్లడించాడు. అయితే చారిత్రాత్మక ఫలితం కారణంగా ఆ నొప్పిని భరించడం సమస్య కాలేదని పేర్కొన్నాడు.

Neeraj Chopra: బంగారు పతకం ముందు బాధలన్నీ చిన్నవే: నీరజ్ చోప్రా
Neeraj Chopra Medal
Follow us
Venkata Chari

|

Updated on: Aug 10, 2021 | 6:57 AM

Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్ 2020లో చరిత్ర సృష్టించిన ప్రదర్శన తర్వాత తన శరీరం చాలా నొప్పి చేసిందని ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా వెల్లడించాడు. అయితే చారిత్రాత్మక ఫలితం కారణంగా ఆ నొప్పిని భరించడం సమస్య కాలేదని పేర్కొన్నాడు. సోమవారం స్వదేశానికి చేరుకున్న తరువాత ఆయన మాట్లాడాడు. ఈమేరకు భారతదేశం నుంచి పతకాలు సాధించిన ఏడుగురు క్రీడాకారులతోపాటు భారత టీం సభ్యులంతా సోమవారం స్వేదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం సాయంత్రం వీరిని ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఒలింపిక్ జావెలిన్‌త్రో స్వర్ణాన్ని గెలుచుకున్న చోప్రా, ఫైనల్‌లో రెండో ప్రయత్నంలో 87.48 మీటర్ల దూరానికి జావెలిన్ విసిరి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ దూరంతోనే నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు.

చోప్రా మాట్లాడుతూ, ‘నేను ప్రత్యేకంగా ఏదో చేశానని నాకు తెలుసు, నిజానికి నేను నా వ్యక్తిగతంగా ఉత్తమంగా ప్రదర్శన అందించాను. నేను త్రో చాలా బాగా చేశాను. కానీ, మరుసటి రోజు నా శరీరం చాలా నొప్పిగా అనిపించింది. శరీరం నొప్పితో సమస్యగా మారింది. కానీ, బంగారు పతకం ముందు ఈ నొప్పి చిన్నదిగానే అనిపించింది. దేశం కోసం ఈ పతకం సాధించడం చాలా ఆనందంగా ఉంది. పతకం సాధించిన తరువాత నుంచి దానిని అస్సలు విడిచిపెట్టలేదని, తన జేజులో ఉంచుకుని, నిద్రపోయేప్పుడు దిండు కింద పెట్టుకున్నానని వెల్లడించాడు. పతకం గెలిచినప్పటి నుంచి సరిగా నిద్రపోలేదు, అలాగే తినలేకపోయాడంట. అవార్డు వేడుకలో, నీరజ్ తన పతకాన్ని అందరికీ చూపించాడు. ఈ పతకం దేశానికి అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఎవరికీ భయపడవద్దు 23 ఏళ్ల ఆర్మీ ప్లేయర్ దేశంలోని ఆటగాళ్లకు తన సందేశం ఇస్తూ.. ఎప్పుడూ భయపడకూడదని, లక్ష్యం వైపు దూసుకెళ్లేందుకు కష్టపడాలని, విజయం సాధిస్తే.. మనం పడ్డ కష్టమంతా చిన్నదై పోతుందని వెల్లడించాడు. ‘ ప్రత్యర్థి ఎవరైనా మీ ఉత్తమ ప్రదర్శన ఇవ్వండి. ఫలితం దానంతట అదే వస్తుందని’ తెలిపాడు. ‘పోటీల్లో చాలా మంది పెద్ద ఆటగాళ్లు ఉన్నారని, అయితే తనపై తనకు నమ్మకం ఉందని, ఇదే విజయానికి దారి తీసిందని’ వెల్లడించాడు. నీరజ్ చోప్రా 13 సంవత్సరాలలో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగాను నిలిచాడు.

Also Read: Olympic winners: టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులకు దేశం జైజేలు.. పతక విజేతలకు కేంద్రం ఘన సన్మానం..చిత్రాలు

Pinky Karmakar: అప్పటి ఒలింపిక్ టార్చ్ బేరర్.. ఇప్పుడు తేయాకు తోటల్లో దినసరి కూలీ!

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా