Pinky Karmakar: అప్పటి ఒలింపిక్ టార్చ్ బేరర్.. ఇప్పుడు తేయాకు తోటల్లో దినసరి కూలీ!

ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గోవడమే చాలా గొప్ప. ఎన్నో అడ్డంకులు దాటితే కానీ.. ఒలింపిక్ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కదు. ఇక ఒలింపిక్ జ్యోతిని చేత పట్టుకోవడం అనేది చాలా ప్రతిష్టాత్మకమైన విషయం.

Pinky Karmakar: అప్పటి ఒలింపిక్ టార్చ్ బేరర్.. ఇప్పుడు తేయాకు తోటల్లో దినసరి కూలీ!
Pinky Karmakar
Follow us

|

Updated on: Aug 09, 2021 | 7:54 PM

Pinky Karmakar: ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గోవడమే చాలా గొప్ప. ఎన్నో అడ్డంకులు దాటితే కానీ.. ఒలింపిక్ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కదు. ఇక ఒలింపిక్ జ్యోతిని చేత పట్టుకోవడం అనేది చాలా ప్రతిష్టాత్మకమైన విషయం. అంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొన్న ఒక క్రీడాకారిణి ఇప్పుడు రోజూవారీ కూలి పనులు చేసుకుంటోంది. ఒక పక్క తొలిసారి భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది.. మరో పక్క ఇదే పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన గతకాలపు క్రీడాకారులు ఆకలితో అలమటిస్తున్నారు. హృదయాన్ని ద్రవింపచేసే ఈ క్రీడాకారిణి గురించి వివరంగా తెలుసుకోండి.

ఆమె పేరు పింకీ కర్మాకర్. అస్సాంలోని దిబ్రుగర్ జిల్లాకు చెందిన యువతి.  లండన్ ఒలింపిక్స్, 2012 లో ఒలింపిక్ టార్చ్ బేరర్‌గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. 9 సంవత్సరాల తరువాత, ఇప్పుడు ఆమె తన జిల్లాలోని టీ తోటలో రోజువారీ వేతన కార్మికురాలిగా తన కుటుంబ పోషణకు సహాయం చేస్తోంది. ఈ ఒలింపిక్స్ నుండి వచ్చేటప్పటికి పింకీ వయసు 17ఏళ్ళు. అంటే టీనేజిలోనే ఆమె మనదేశానికి టార్చ్ బేరర్ గా ప్రాతినిధ్యం వహించింది. అప్పట్లో ఆమె లండన్ నుంచి తిరిగి వచ్చిన సమయంలో ఆమెకు అప్పటి కేంద్ర మంత్రి.. అస్సాం మాజీ ముఖ్యమంత్రి ర్బానంద సోనోవాల్, అప్పటి దిబ్రూగర్ ఎంపీ, పింకీకి  విమానాశ్రయంలో  ఘనస్వాగతం పలికారు.

ఆ తరువాత రెండు ఒలింపిక్స్ జరిగాయి. ఈ ఎనిమిదేళ్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయి నుంచి పింకీ తీ తోటల్లో కూలీగా మారిపోయింది. ఇది మన దేశంలో క్రీడాకారుల పట్ల పాలకుల చిత్తశుద్ధిని తెలుపుతోంది. ఇంతకీ ఇప్పుడు ఆమె రోజువారి కూలి ఎంతో తెలుసా? కేవలం 167 రూపాయలు.

ఆమె తల్లి మరణం, తండ్రి వార్ధక్యం కారణంగా..ఇప్పుడు పింకీ తన కుటుంబాన్ని చూసుకుంటోంది. ఆమెకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.

ఆమె 17 సంవత్సరాల వయస్సులో 10 వ తరగతి చదువుతున్నప్పుడు, పింకీ తన పాఠశాలలో యునిసెఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్‌మెంట్ (S4D) ప్రోగ్రామ్‌ని నడుపుతూ, దాదాపు 40 మంది మహిళలకు బోధించేది. ఆమె తన ప్రాంతంలో వయోజన అక్షరాస్యత కోసం తీవ్రంగా శ్రమించింది. 10 వ తరగతిలో ఉన్నప్పుడు లండన్ ఒలింపిక్స్‌లో భారతదేశం యొక్క టార్చ్ బేరర్‌గా అవకాశం వచ్చినప్పుడు అది అతిపెద్ద అవకాశంగా భావించాననీ..  అది తన జీవితాన్ని ఎంతో మారుస్తుందని అనుకున్నాననీ ఆమె చెబుతోంది.

“ప్రస్తుతం నేను బోర్బోరువా టీ గార్డెన్‌లో రోజువారీ వేతన కార్మికురాలిగా పని చేస్తున్నాను. అలాగే,  నా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సు చేస్తున్నాను. నాకు ప్రభుత్వం లేదా ఇతరుల నుండి సహాయం ఏమీ రాలేదు. ఇది నాకు చాలా బాధ కలిగించింది.” అని పింకీ కర్మాకర్ అంటోంది.

యునిసెఫ్ లేదా ఒలింపిక్ కమిటీ లేదా ప్రభుత్వం నుండి తనకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని పింకీ తెలిపిండి. “నేను విన్నాను, ఒలింపిక్ టార్చ్ బేరర్‌లకు కొంత రెమ్యూనరేషన్ ఇస్తారు, కానీ నాకు ఏమీ రాలేదు. గత 9-10 సంవత్సరాలుగా నేను ప్రతిరోజూ బాధతో గడిపాను” అని పింకీ చెప్పింది.

తన కుటుంబం తీవ్రమైన ఆర్థిక సమస్యను ఎదుర్కొంటోందని ఆమె తెలిపింది. పింకీ తల్లి బోర్బోరూహ్ టీ ఎస్టేట్‌లో రోజువారీ కూలీ కార్మికురాలుగా పనిచేసేది.  ఆమె మరణం తరువాత ఆ పనిని పింకీ చేస్తోంది.

2012 లండన్ ఒలింపిక్స్‌లో పింకీ కర్మాకర్ టార్చ్ రిలేలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించినప్పుడు తమ సమాజానికి గర్వించదగిన క్షణం అని భావించినట్టు స్థానిక అస్సాం టీ స్టూడెంట్ అసోసియేషన్ (AATSA) నాయకుడు జూన్ కర్మాకర్ అన్నారు. ఆమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. “ప్రభుత్వం ఆమెకు సహాయం చేస్తుందని మేము భావించాము. అదేవిధంగా పింకీని చూసిన తర్వాత యువత క్రీడా కార్యకలాపాలపై ఆసక్తి చూపుతుందని అనుకున్నాము.  కానీఅటువంటిదేమీ జరగలేదు” అని జూన్ కర్మాకర్ చెప్పారు.

Also Read: Neeraj Chopra: నీరజ్ చోప్రా కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే షాకవుతారు..!

Tokyo Olympic 2020: ముగిసిన ఒలింపిక్ సంబురం.. భారత పతాకధారిగా బజరంగ్ పూనియా..!

Latest Articles