Dan Christian: రీప్లేస్మెంట్ గా బరిలోకి దిగి ఊచకోత కోసిన అసిస్టెంట్ కోచ్!

బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ ఆటగాళ్లు గాయపడటంతో అసిస్టెంట్ కోచ్ డాన్ క్రిస్టియన్ బరిలోకి దిగాడు. బ్యాటింగ్‌లో 92 మీటర్ల సిక్స్ కొట్టి, బౌలింగ్‌లో ఒక వికెట్ తీసి అలరించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ 2023లో రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ, ఈ మ్యాచ్‌లో ప్రత్యేకంగా జట్టును ముందుకు నడిపించాడు. చివరికి, బ్రిస్బేన్ హీట్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Dan Christian: రీప్లేస్మెంట్ గా బరిలోకి దిగి ఊచకోత కోసిన అసిస్టెంట్ కోచ్!
Christian
Follow us
Narsimha

|

Updated on: Jan 07, 2025 | 6:56 PM

క్రికెట్ చరిత్రలో అరుదైన సంఘటన బిగ్ బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది. బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ జట్టు అనుకోని పరిస్థితులను ఎదుర్కొంది. ఆటగాళ్లు గాయపడటంతో అసిస్టెంట్ కోచ్ డాన్ క్రిస్టియన్ బరిలో దిగడం అందరిని ఆశ్చర్యపరిచింది. బ్యాటింగ్‌లో 92 మీటర్ల సిక్సర్ కొట్టి హైలైట్ అయిన క్రిస్టియన్, బౌలింగ్‌లో కూడా ఒక వికెట్ తీయడం విశేషం.

ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ, జట్టు మొత్తం 173 పరుగులకే పరిమితమైంది. వార్నర్ తర్వాత అత్యధిక స్కోర్ చేసిన డాన్ క్రిస్టియన్ ఆటలో చివరి వరకు నిలిచి జట్టుకు సహాయపడే ప్రయత్నం చేశాడు.

క్రిస్టియన్ బరిలోకి దిగడం సిడ్నీ థండర్స్ ఆటగాళ్ల గాయాలతో వచ్చే క్లిష్ట పరిస్థితులను ప్రతిబింబించింది. బాన్ క్రాఫ్ట్, డానియెల్ సామ్స్ గాయపడటంతో రీప్లేస్మెంట్ గా రావాల్సిన ఆటగాళ్లు కూడా అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. క్రిస్టియన్ తన 153 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ చక్కటి ప్రదర్శన ఇచ్చాడు.

అయితే, ఈ గొప్ప ప్రయత్నాలు కూడా సిడ్నీ థండర్స్‌ను ఓటమి నుంచి కాపాడలేకపోయాయి. బ్రిస్బేన్ హీట్ జట్టు బ్రయాంట్, రెన్సో ధాటిగా ఆడి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచింది.