Hair Care Tips: ఎందుకు పనికి రాదని కొబ్బరి చిప్పని విసిరేస్తున్నారా.. ఇలా ఉపయోగిస్తే ఒత్తైన, పొడవైన జుట్టు మీ సొంతం

ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పులతో పాటు తినే ఆహారంలో వచ్చిన మార్పులతో జుట్టు ఊడిపోవడం సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. అందుకే చాలా మంది జుట్టు సంరక్షణ కోసం మార్కెట్ లో లభించే అనేక ఉత్పత్తులను వాడుతున్నారు. అయితే ఇంట్లో లభించే కొబ్బరి చిప్ప బొగ్గుతో జుట్టును సహజంగానే సంరక్షించుకోవచ్చు. ఈ రోజు జుట్టుని కొబ్బరి చిప్ప బొగ్గుతో సంరక్షించుకోవచ్చో తెలుసుకుందాం..

Hair Care Tips: ఎందుకు పనికి రాదని కొబ్బరి చిప్పని విసిరేస్తున్నారా.. ఇలా ఉపయోగిస్తే ఒత్తైన, పొడవైన జుట్టు మీ సొంతం
Hair Care Tips
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2025 | 8:12 PM

ప్రస్తుతం కొబ్బరి చిప్పతో గిన్నెలు, సాస్‌లు వంటి అలంకార వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ కొబ్బరి చిప్పను కొందరు వంట చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇస్త్రీ చేసే సమయంలో ఐరెన్ బాక్స్ లో కూడా ఈ కొబ్బరి చిప్పలతో చేసిన నిప్పులను వేస్తారు. కొబ్బరి చిప్పలతో రకరకాల ప్రయోజనాలున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొబ్బరి చిప్పలను వెలిగించిన తర్వాత వచ్చిన బొగ్గుతో కూడా అనేక ప్రయోజనాలున్నాయి. కొబ్బరి చిప్ప బొగ్గు పొడి చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు. కొబ్బరి చిప్ప బొగ్గుని పొడిగా చేసి జుట్టు నల్లగా మారుతుంది.

సహజసిద్ధమైన షాంపూ: మార్కెట్‌లో లభించే షాంపూని వాడే వారే ప్రస్తుతం ఎక్కువ మంది ఉన్నారు. కెమికల్ షాంపూని ఉపయోగించకుండా కొబ్బరి చిప్పల బూడిదను షాంపూగా ఉపయోగించవచ్చు. మీరు ఉపయోగించే షాంపూలో కొబ్బరి చిప్పల బూడిద వేసి బాగా కలపాలి. దీన్ని షాంపూగా ఉపయోగించడం వల్ల జుట్టు శుభ్రపడటమే కాకుండా జుట్టు ఊదడం తగ్గి జుట్టు పెరుగుతుంది.

కొబ్బరి చిప్ప చార్‌కోల్ పౌడర్ స్క్రబ్: ఇది స్కాల్ప్‌ను శుభ్రపరిచే ఉత్తమ స్క్రబ్. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి చిప్పల బూడిదను తీసుకుని కొబ్బరి నూనెతో కలపండి. ఈ మిశ్రమంతో స్కాల్ప్ ను సున్నితంగా స్క్రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టులోని మలినాలు తొలగిపోతాయి. స్కాల్ప్ నుంచి అదనపు నూనెను గ్రహించి జుట్టులోని జిడ్డు తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

హెయిర్ మాస్క్: కొబ్బరి చిప్పల బూడిదతో హెయిర్ మాస్క్ తయారు చేసి జుట్టుకు అప్లై చేయడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఒక కప్పు నీటిలో అర చెంచా బేకింగ్ సోడా, అర చెంచా కొబ్బరి చిప్పల బూడిదవేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మృదువుగా మసాజ్ చేసి కాసేపు అలాగే ఉంచి తలస్నానం చేయాలి. ఈ నేచురల్ హెయిర్ మాస్క్ చిట్లిన జుట్టును రిపేర్ చేస్తుంది. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలనుంచి ఉపశమనం ఇస్తుంది. అంతేకాదు జుట్టు అందంగా ఒత్తుగా పెరిగేలా సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)