Skin Care Tips: నిమ్మ స్కిన్ కి మంచిదే.. నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
సిట్రస్ పండ్లలో నిమ్మకాయ ఒకటి. దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. నిమ్మతో ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. అదే విధంగా అందానికి కూడా అంతే ఉపయోగపడుతుంది. అయితే నిమ్మకాయను చర్మానికి అప్లై చేయడం ప్రయోజనకరంగా పరిగణింపబడుతోంది. దీన్ని తినడం లేదా స్కిన్ ని అప్లై చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలా మంది నిమ్మకాయను నేరుగా ముఖంపై అప్లై చేస్తారు..ఇలా చేయడం ప్రయోజనాలకు బదులుగా చర్మానికి హాని కలిగిస్తుంది.
ముఖం కాంతివంతంగా, మచ్చలు లేకుండా చేసుకోవడానికి సింపుల్ టిప్స్ నుంచి ఖరీదైన ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తారు. ముఖం, చర్మ సౌందర్య కోసం చికిత్స నుంచి అనేక రకాల టిప్స్ ని ఉపయోగిస్తారు. అయితే చర్మంపై ప్రతిదానిని అప్లై చేసే ముందు అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం ముఖ్యం. ఈ రోజు మనం చర్మానికి ఎంతో మేలు చేసే నిమ్మకాయ గురించి తెలుసుకుందాం. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.. కనుక ఇది చర్మం మీద ఉన్న మచ్చలను తొలగించడానికి శక్తివంతమైన పదార్ధం. అయితే దీనిని అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. నిమ్మకాయను ఎప్పుడూ నేరుగా చర్మంపై అప్లై చేయకూడదు. ఇలా నేరుగా స్కిన్ కు నిమ్మకాయను అప్లై చేయడం వలన ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకుందాం..
నిమ్మకాయలో విటమిన్లు సమృద్ధిగా ఉండడమే కాదు.. ఇది సహజమైన బ్లీచింగ్‌గా పనిచేస్తుంది. అందువల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిలో ఆమ్ల లక్షణాల కారణంగా చర్మంపై నేరుగా అప్లై చేయడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి.. ఎందుకు నిమ్మకాయను నేరుగా చర్మంపై ఎందుకు అప్లై చేయకూడదంటే..
దురద, దహనం, ఎరుపు సంభవించవచ్చు: నిమ్మకాయను నేరుగా ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. దీని వల్ల దురద, మంట, ఎరుపు వంటి సమస్యలు వస్తాయి. అందుకే శనగపిండి, ముల్తానీ మిట్టి, గ్లిజరిన్, కొబ్బరినూనె, కలబంద జెల్ వంటి కొన్ని పదార్థాలతో కలుపుకోవాలి. ఇలా నిమ్మని కొన్ని పదార్ధాలతో కలిపి రాయడం వలన చర్మం అందంగా ఉంటుంది.
వీరు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి: సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ముఖ్యంగా చర్మంపై నేరుగా నిమ్మకాయను అప్లై చేయవద్దు. ఇలాంటి చర్మ తత్వం ఉన్నవారు నేరుగా నిమ్మకయని అప్లై చేస్తే చర్మం వాపు, ఎరుపు, దద్దుర్లు ఏర్పడవచ్చు. ఈ లక్షణాలను తేలికగా తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది.
వడదెబ్బ ప్రమాదం పెరుగుతుంది: నిమ్మకాయను నేరుగా చర్మంపై అప్లై చేసినప్పుడు.. స్కిన్ చాలా సున్నితంగా మారుతుంది. దీని కారణంగా సూర్యరశ్మి స్కిన్ కు తాకినప్పుడు వడదెబ్బకు గురవుతారు. హైపర్పిగ్మెంటేషన్ కూడా ఏర్పడవచ్చు. కనుక పొరపాటున కూడా వేసవిలో నిమ్మకాయను నేరుగా చర్మంపై రుద్దకూడదు.
చర్మం PH స్థాయిపై ప్రభావం: నిమ్మకాయలో ఆమ్లతత్వం ఉంటుంది. ఈ కారణంగా నేరుగా నిమ్మని చర్మంపై అప్లై చేసినప్పుడు pH బ్యాలెన్స్ లో మార్పులు వస్తాయి. అప్పుడు చర్మ సమస్యలు ప్రేరేపించబడటం ప్రారంభిస్తాయి. చర్మం స్థితిస్థాపకత తగ్గుతుంది. తక్కువ వయస్సులో ముడతలు ఏర్పడతాయి. మొటిమల సమస్య పెరిగేకొద్దీ చర్మంపై నల్లదనం కనిపించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)