Maha Kumbhamela 2025: మహాకుంభమేళాపై విదేశీయులూ అమితాసక్తి.. ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే..?
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభ మేళా కోసం యూపీ సర్కార్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో యాత్రికులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ మహా కుంభ కోసం చేస్తోన్న ఏర్పాట్లను యుపీ సర్కార్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తుంది. ఈ కుంభమేళా కోసం చేస్తోన్న ఏర్పాట్లను ప్రదర్శిస్తున్న వెబ్ సైట్ ను 183 దేశాల ప్రజలు సందర్శిస్తున్నట్లు యూపీ సర్కార్ వెల్లడించింది.
త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభ మేళా కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం అందరి నోటా కుంభమేళాకు సంబంధించిన మాటలే వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 2025 జనవరి 13 న ప్రారంభంకానున్న మహా కుంభ కోసం ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు ఇక్కడ జరుగుతున్న కుంభ మేళా జాతర విశిష్టత గురించి, ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు దేశ విదేశాల్లోని ప్రజలకు తెలిసేలా ఒక వెబ్ సైట్ ని ప్రారంభించింది. అయితే కుంభ మేళాకు సంబంధించిన సమాచారాన్ని వివిధ వెబ్‌సైట్‌లు, పోర్టల్‌ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తెలుసుకుంటున్నారని.. ప్రపంచవ్యాప్తంగా 183 దేశాల ప్రజలు సమాచారం తెలుసుకున్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం మహా కుంభకు సంబందించిన సమాచారం తెలుసుకునే అధికారిక వెబ్‌సైట్ https://kumbh.gov.in/ ప్రాథమిక వనరుగా ఉద్భవించింది, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఈ వెబ్ సైట్ ద్వారా ప్రయాగ్ రాజ్ గురించి తెలుసుకుంటున్నారు. దీంతో ఈ సైట్ కు భారీగా ట్రాఫిక్ ఉందని ప్రకటనలో తెలిపింది. వెబ్‌సైట్ డేటా ప్రకారం, జనవరి 4 నాటికి 183 దేశాలకు సంబంధించిన దాదాపు 33 లక్షల మంది సందర్శకులు మహా కుంభకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి పోర్టల్‌ను సందర్శించారు. యూరప్, అమెరికా, ఆఫ్రికా వంటి ఖండాల్లోని వివిధ దేశాలకు సంబంధించిన ప్రజలు ఈవెంట్‌ను చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని వెల్లడించింది.
జనవరి 4 నాటికి మొత్తం 33,05,667 మంది వినియోగదారులు అధికారిక మహా కుంభ పోర్టల్‌ను సందర్శించారని వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న సాంకేతిక బృందం ప్రతినిధి ధృవీకరించారు. ఈ వినియోగదారులు 183 దేశాలకు చెందినవారు కాగా ప్రపంచవ్యాప్తంగా 6,206 నగరాలకు సంబంధించిన వారు సందర్శించినట్లు వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, కెనడా, జర్మనీ నుంచి గణనీయమైన ట్రాఫిక్ నెలకొనగా.. వెబ్‌సైట్ సందర్శించిన దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే.. సందర్శకులు వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడమే కాదు.. కుంభ మేళాకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
కుంభ మేళా గురించి తెలియజేసేందుకు వెబ్‌సైట్ ప్రారంభించినప్పటి నుంచి ట్రాఫిక్‌లో గణనీయమైన పెరుగుదల ఉందని సాంకేతిక బృందం గుర్తించింది. అయితే ఈ కార్యక్రమం దగ్గర పడే కొద్దీ ఈ సెట్ ను చూస్తున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోందని.. ఇప్పుడు మిలియన్లకు చేరుకుంది” అని వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహా కుంభ్‌ను ‘డిజిటల్ మహా కుంభ్’గా ప్రదర్శిస్తోంది. భక్తుల సౌకర్యార్థం అనేక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అభివృద్ధి చేసింది. మహా కుంభ అధికారిక వెబ్‌సైట్‌ను 6 అక్టోబర్ 2024న ప్రయాగ్‌రాజ్‌లో CM యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ మహా కుంభం గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. కుంభంకు సంబంధించిన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, కుంభంపై నిర్వహించిన అధ్యయనాల గురించిన వివరాలను భక్తులకు సులభంగా అందిస్తోంది. అంతేకాదు వెబ్‌సైట్ ప్రధాన ఆకర్షణలు, స్నానోత్సవాలు, ఈవెంట్ సమయంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు అనే విషయలపై కూడా మార్గదర్శకాలను ఈ సైట్ లో పొందుపరిచింది. ఇంకా ఈ వెబ్‌సైట్ ప్రయాణం, వసతి ఎంపికలు, మీడియా గ్యాలరీ గురించి పూర్తి వివరాలను అందిస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఈ డిజిటల్ కార్యక్రమం మహా కుంభం సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వం వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..