Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే..
కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ డిల్లీ అసెంబ్లీ ఎన్నికల వివరాలను వెల్లడించారు.. ఫిబ్రవరి 15తో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనుంది.. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఢిల్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను ప్రకటించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ డిల్లీ అసెంబ్లీ ఎన్నికల వివరాలను వెల్లడించారు.. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే దశలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఢిల్లీలో ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చినట్టు ఈసీ ప్రకటించింది.
ఈనెల 10వ తేదీన ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఫిభ్రవరి 17వ తేదీ వరకు నామినేషన్ల గడువు విధించారు. ఈనెల 20వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.
ఢిల్లీలో ప్రస్తుతం 1 కోటి 55 లక్షల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 83 లక్షలకు పైగా పురుష ఓటర్లు ఉండగా, 71.74 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఈసారి ఢిల్లీలో భారీ ఎత్తున ఓటింగ్ జరిగే అవకాశం ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఇదే తొలి ఎన్నికలని.. యువత ప్రజాస్వామ్యంలో తమ వంతు పాత్ర పోషించాలంటూ కోరారు.
ఫిబ్రవరి 15తో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనుంది.. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాయి.. ఢిల్లీలో త్రిముఖ పోరు ఉండనుంది.
ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యం..
ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్.. ఈవీఎంల హ్యాకింగ్ ఆరోపణలపై స్పందించారు. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమని పేర్కొన్నారు. ఈవీఎంలను రిగ్గింగ్ చేయడం కూడా వీలుకాదని.. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్టు ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సీఈసీ రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..