Vaikunta Ekadasi 2025: కోరిన కోర్కెలు నెరవేరాలా.. వైకుంఠ ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేయండి..

వైకుంఠ ఏకాదశి తిధి విష్ణుమూర్తికి అంకితం చేయబడిన తిధి. హిందూ మతంలో ఈ రోజు చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువు అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి దేవుడిని పూజిస్తారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజించడం, ఉపవాసం చేయడంతో పాటు దానధర్మాలు చేయడం కూడా చాలా పుణ్యంగా భావిస్తారు. ఈ రోజు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఏమి దానం చేయాలో తెలుసుకుందాం.

Vaikunta Ekadasi 2025: కోరిన కోర్కెలు నెరవేరాలా.. వైకుంఠ ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేయండి..
Vaikunta Ekadasi 2025
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2025 | 3:09 PM

హిందూ మతంలో వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజు శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడింది. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. హిందూ విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఉపవాసం, పూజలు చేసిన వారికి మరణానంతరం మోక్షం లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజించి వ్రతాన్ని ఆచరించిన వారి పాపాలు నశిస్తాయని శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి జనవరి 9 మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మర్నాడు అంటే జనవరి 10 ఉదయం 10:19 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం, వైకుంఠ ఏకాదశి ఉపవాసం జనవరి 10 న ఆచరించాల్సి ఉంటుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం, ఉపవాసం ఉండడంతో పాటు దానధర్మాలు చేయడం కూడా చాలా పుణ్యంగా భావిస్తారు. కనుక వైకుంఠ ఏకాదశి రోజున ఏయే వస్తువులు దానం చేయడం శుభ ప్రదమో తెలుసుకుందాం.

ఏ వస్తువులను దానం చేయాలంటే..

  1. వైకుంఠ ఏకాదశి రోజున పేదలకు అన్నం, బట్టలు, డబ్బు దానం చేయడం శుభప్రదం అని నమ్మకం. ఇలా చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.
  2. ఈ రోజున తులసి మొక్క, దుప్పటి, ధాన్యాన్ని కూడా దానం చేయడం మంచిది. ఇలా చేయడం వలన పుణ్యం కలుగుతుందని.. శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
  3. ఈ రోజున గోవును దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. ఇలా చేయడం వల్ల సకల సిరి సంపదలు లభిస్తాయని.. సమాజంలో గౌరవం లభిస్తుందని నమ్మకం.

ఏ పనులు చేయవద్దంటే

  1. వైకుంఠ ఏకాదశి రోజున మనసులో ప్రతికూల ఆలోచనలు చేయవద్దు.
  2. ఈ రోజు అబద్ధం చెప్పకూడదు.
  3. ఈ రోజు కోపం తెచ్చుకోకూడదు.
  4. ఈ రోజున మాంసాహారం తినకూడదు.
  5. ఈ రోజున ఉల్లిపాయలు, వెల్లుల్లి తీసుకోవద్దు.

వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత

వైకుంఠ ఏకాదశి రోజు మతపరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఆరాధించడం, ఉపవాసం ఉండడం వల్ల మనసులోని మాలిన్యాలు తొలగిపోతాయి. మనస్సు స్వచ్ఛంగా, పవిత్రంగా మారుతుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల ఇంట్లోని కష్టాలు తొలగిపోతాయి. అంతే కాదు ఆనందం , సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటాయి. ఈ రోజున పూజలు చేసి ఉపవాసం ఉండేవారు మోక్షం లభిస్తుదని.. స్వర్గానికి చేరుకుంటారని నమ్మకం. మరణానంతరం మరు జన్మ లేకుండా మోక్షాన్ని పొంది వైకుంఠ ధామంలో స్థానం పొందుతారని నమ్మకం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.