Solar, Lunar Eclipse: 2025లో ఎన్ని గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి? మన దేశంలో ఏ గ్రహణం కనిపిస్తుందో తెలుసా..

హిందూ మతంలో గ్రహణానికి ప్రాముఖ్యత ఉంది. గ్రహణ సమయం అశుభమైనదిగా పరిగణించబడుతుంది. గ్రహణ సమయంలో అన్ని రకాల శుభకార్యాలు నిషేధించబడ్డాయి. తినడం, త్రాగడం కూడా నిషేధించబడింది. సూర్యచంద్రుల గ్రహణం గురించి భారతదేశంలోని ప్రజలలో చాలా నమ్మకాలున్నాయి. అటువంటి పరిస్థితిలో 2025 సంవత్సరంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఎన్ని.. ఏ తేదీలలో సంభవిస్తాయో తెలుసుకుందాం.

Solar, Lunar Eclipse: 2025లో ఎన్ని గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి? మన దేశంలో ఏ గ్రహణం కనిపిస్తుందో తెలుసా..
Solar And Lunar Eclipses In 2025
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2025 | 3:41 PM

హిందూ మత గ్రంధాలలో గ్రహణ కాలాన్ని అశుభ సమయం అని పిలుస్తారు. గ్రహణ సమయంలో ఎటువంటి పూజలు, శుభ కార్యాలు నిర్వహించరు. అంతేకాదు గ్రహణ సమయంలో కొన్ని పనులను కూడా చేయరు. ఈ సమయంలో కొన్ని రకాల మంత్రాలను జపిస్తూ దైవ నామ స్మరణ చేస్తారు. ఇలా చేయడం వల్ల గ్రహణ దుష్ఫలితాలు తగ్గుతాయని నమ్మకం. అయితే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం.. ఈ ఏడాదిలో ఎన్ని గ్రహణాలు ఏర్పడనున్నాయి.. ఎప్పుడు ఏ తేదీల్లో గ్రహణాలు ఏర్పడనుయి.. ఏ దేశాలపై ప్రభావం చూపించనున్నాయంటే..

2025లో నాలుగు గ్రహణాలు

2025లో నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు గ్రహణాలు సూర్యునిపై , రెండు గ్రహణాలు చంద్రునిపై ప్రభావం చూపనున్నాయి. అయితే వీటిలో ఒకటి మాత్రమే భారతదేశంలో కనిపిస్తుంది. మిగిలిన మూడు గ్రహణాలు భారతదేశంలో కనిపించవు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం విషయంలో హిందువులకు ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. కనుక ఈ రోజు 2025 సంవత్సరంలో ఏయే తేదీల్లో గ్రహణాలు ఏర్పడనున్నాయో తెలుసుకుందాం.

మార్చి 14న తొలి చంద్రగ్రహణం

2025 సంవత్సరంలో మొదటి గ్రహణం చంద్రునిపై ప్రభావం చూపుతుంది. మార్చి 14న పౌర్ణమి తిధి రోజున చంద్ర గ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణం ఏర్పడే సమయం భారతదేశంలో ఉదయం. అటువంటి పరిస్థితిలో ఈ చంద్రగ్రహణం భారతదేశ ప్రజలకు కనిపించదు. అమెరికా, పశ్చిమ యూరప్, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర , దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం వంటి ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మార్చి 29న పాక్షిక సూర్యగ్రహణం

2025లో రెండో గ్రహణం ఏర్పడనుంది. మార్చి 29న అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఈ సూర్య గ్రహణం కూడా భారతదేశ ప్రజలకు కనిపించదు. ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, యూరప్ , వాయువ్య రష్యా ప్రజలకు ఈ గ్రహణం కనిపిస్తుంది.

సెప్టెంబరులో సంపూర్ణ చంద్రగ్రహణం

సెప్టెంబర్ 7న చంద్రుడు నిండుగా కనిపించనున్నాడు. దీనినే పౌర్ణమి అంటారు. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 8:58 గంటలకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం అదే రోజు రాత్రి 2:25 గంటల వరకు ఉంటుంది. గ్రహణం సమయంలో చంద్రుడు ముదురు ఎరుపు రంగులో కనిపించనున్నాడు. భారతదేశం అంతటా ప్రజలు ఈ చంద్రగ్రహణాన్ని చూస్తారు. ఈ చంద్రగ్రహణం ఆసియాలోని అన్ని దేశాలలో కనిపిస్తుంది. ఇది యూరప్, అంటార్కిటికా, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో కూడా సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపిస్తుంది.

సెప్టెంబర్ 21-22 తేదీలలో సంవత్సరంలో చివరి గ్రహణం

సంవత్సరంలో చివరి గ్రహణం కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 21వ తేదీలలో మరికొన్ని ప్రాంతాల్లో 22 తేదీలలో గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం న్యూజిలాండ్, తూర్పు మెలనేషియా, దక్షిణ పాలినేషియా, పశ్చిమ అంటార్కిటికాలో కనిపిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.