Winter Care Tips: చలికాలంలో వెచ్చదనం, ఆరోగ్యం కోసం ఈ టీలు తాగండి.. ఎలా తయరు చేసుకోవాలంటే
చలికాలంలో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవాలని కోరుకుంటుంటే.. కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినే ఆహారంలో చేర్చుకుంటారు. అంతేకాదు సూప్స్, టీ వంటి వాటిని తాగడం వలన చలికాలంలో వెచ్చగా ఉంటుంది. ఈ రోజు చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ప్రత్యేకమైన టీల గురించి తెలుసుకుందాం.. వీటిని తీసుకోవడం ద్వారా మిమ్మల్ని వెచ్చగా ఉంచుకోవడమే కాదు.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా కష్టమైన పని. వెచ్చదనం కోసం ఎన్ని రకాల దుస్తులు ధరించినా.. లోపల నుంచి శరీరం వెచ్చగా ఉండేలా చేసుకోవాలి. అప్పటి వరకూ చలిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చలికాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు, పానీయాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
చలికాలంలో వేడి ఆహార పదార్థాలు, పానీయాలను తినే ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగడంలో సహాయపడతాయి. బయట ఉష్ణోగ్రత తగ్గినప్పుడు.. వేడి వేడి ఆహార పదార్థాలను, పానీయాలు తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. ఈ నేపధ్యంలో చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే టీలు ఏమిటి.. అవి రోగనిరోధక శక్తిని ఎలా పెంచుతాయో ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా చెప్పిన విషయాలు తెలుసుకుందాం..
హెర్బల్ టీ. శీతాకాలంలో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి హెర్బల్ టీని తీసుకోవచ్చని డాక్టర్ కిరణ్ గుప్తా చెప్పారు. చామంతి, అల్లం లేదా పుదీనా వంటి హెర్బల్ టీలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సాధారణ మిల్క్ టీ లేదా కాఫీతో పోలిస్తే, హెర్బల్ టీ శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడటమే కాదు ఈ రెండు టీలు మరింత ఆరోగ్యకరమైనవి. హెర్బల్ టీలో శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే వార్మింగ్ లక్షణాలు ఉన్నాయి.
ఇంట్లోనే నేచురల్ టీని తయారు చేసుకోండి ఇలా హెర్బల్ టీ మాత్రమే కాదు.. మసాలా టీని కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చలికాలంలో వెచ్చదనం కోసం వంటగదిలో లభించే మసాలా దినుసులను ఉపయోగించి టీ తయారు చేసుకోవచ్చు. ఇందులో కొన్ని మసాలా దినుసులను ఉపయోగించాలి. అయితే మసాలా దినుసులను ఎక్కువ పరిమాణంలో ఉండకూడదని గుర్తుంచుకోండి. ఈ టీ చేయడానికి బే ఆకు, లవంగం, చిన్న అల్లం ముక్క, నల్ల మిరియాలు, జీలకర్ర వంటివి అవసరం.
ఈ టీని 4-5 మందికి తయారు చేస్తుంటే.. దీని కోసం మీరు ఒక బే ఆకు, ఒక లవంగం మొగ్గ, అల్లం ముక్క, 10-15 మిరియాలు, దాల్చినచెక్క, జీలకర్రను ఉపయోగించవచ్చు. ఈ పదార్థాలన్నింటినీ నీటిలో వేసి బాగా మరిగించండి. స్వీట్ గా టీ తాగాలనుకుంటే.. ఈ నీటిలో కొంచెం బెల్లం లేదా తేనెను ఉపయోగించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)