AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ శనివారం అత్యంత విశిష్టమైన రోజు.. శని దోష నివారణకు ఈ పరిహారాలు చేసి చూడండి..

శని ప్రదోష ఉపవాసం హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివుని పూజించి ఉపవాసం ఉండే సంప్రదాయం ఉంది. అంతేకాదు ఈ రోజున శనీశ్వరుడిని కూడా పూజిస్తారు. ఎవరైతే ఈ రోజున పూజ చేసి ఉపవాసం ఉంటారో వారి జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. అదే సమయంలో ఈ రోజున శనీశ్వరుడి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు కూడా ప్రస్తావించారు. వీటిని చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం.

ఈ శనివారం అత్యంత విశిష్టమైన రోజు.. శని దోష నివారణకు ఈ పరిహారాలు చేసి చూడండి..
Shani Pradosh Vrat
Surya Kala
|

Updated on: Jan 07, 2025 | 6:29 PM

Share

హిందూ మతంలో ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రత మహిమ శివపురాణంలో పేర్కొనబడింది. ఈ వ్రతాన్ని ప్రతి నెల త్రయోదశి తిధి రోజున ఆచరిస్తారు. ఈ ఉపవాసం నెలకు రెండుసార్లు వస్తుంది. ఈ రోజున శివుని పూజించి ఉపవాసం ఉంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రజలు ఈ రోజున ఉపవాసం ఉంటే పరమశివుని విశేష ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఈ రోజున ఉపవాసం చేసి శివుడిని,శనిశ్వరుడిని పూజిస్తే ఆ ఇళ్లలో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు. అదే సమయంలో బాధలన్నీ తొలగిపోతాయని విశ్వాసం.

ఈ సంవత్సరం మొదటి శని ప్రదోష వ్రతం ఎప్పుడంటే

ఈ ఏడాది తొలి ప్రదోష వ్రతం శనివారం వచ్చింది. అందుకే దీనిని శని ప్రదోష వ్రతం అని కూడా అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం శని ప్రదోష వ్రతం జనవరి 11 ఉదయం 8.21 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ జనవరి 12 ఉదయం 6:33 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం శని ప్రదోష వ్రతం జనవరి 11 న ఆచరించనున్నారు.

ఇవి కూడా చదవండి

శని ప్రదోష నాడు చేయాల్సిన పరిహారాలు

  1. శని ప్రదోష వ్రతం రోజున శివలింగానికి గంగాజలం, పాలు, తేనెతో అభిషేకం చేయాలి. శివునికి బిల్వ పత్రం, ఉమ్మెత్త పువ్వులు అంటే చాలా ఇష్టం. కనుక ఈ రోజున శివునికి బిల్వ పత్రం, ఉమ్మెత్త పువ్వులు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శని దోషం నుండి ఉపశమనం లభిస్తుంది.
  2. ఈ శివలింగానికి చదనం సమర్పించడం వలన ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోతుందని నమ్మకం
  3. ఈ రోజున శివునికి గంగాజలం, అన్నం నైవేద్యంగా సమర్పించడం ద్వారా.. వ్యక్తి రుణ విముక్తుడవుతాడు. అంతేకాదు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతాడు.
  4. శని ప్రదోష ఉపవాసం రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది.
  5. ఈ రోజు శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులు, నూనెను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురదృష్టం అదృష్టంగా మారుతుంది.
  6. ఈ రోజు పేదలకు.. ఆకలి అన్నవారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి కలుగుతాయి.
  7. శనీశ్వరుడి నీలం రంగు అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ రోజున నీలం రంగు దుస్తులు ధరించాలి. అంతేకాకుండా శనీశ్వరుడికి నీలిరంగు పూలను కూడా సమర్పించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

Follow Us
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. క్యాన్సర్‎ను తరిమికొడుతుంది
వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. క్యాన్సర్‎ను తరిమికొడుతుంది
కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..
కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..
తిరుమల వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి శుభవార్త
తిరుమల వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి శుభవార్త
గంభీర్ లోని మరో కోణం..రింకూకు కోచ్ ఇచ్చిన భరోసా ఏంటంటే
గంభీర్ లోని మరో కోణం..రింకూకు కోచ్ ఇచ్చిన భరోసా ఏంటంటే
అసలైన పాములతో స్నేక్ అండ్ లాడర్ ఆడుతూ హల్‌చల్..షాకింగ్ వీడియో
అసలైన పాములతో స్నేక్ అండ్ లాడర్ ఆడుతూ హల్‌చల్..షాకింగ్ వీడియో
బెంగళూరు నుంచి తిరుమలకు వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఐదుగురు మృతి
బెంగళూరు నుంచి తిరుమలకు వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఐదుగురు మృతి
తెలంగాణలో వారికి ఫ్రీ బస్ స్కీమ్.. అసలు నిజం ఏంటంటే..?
తెలంగాణలో వారికి ఫ్రీ బస్ స్కీమ్.. అసలు నిజం ఏంటంటే..?
ఉపాధి కూలీలకు కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే వేతనం కట్
ఉపాధి కూలీలకు కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే వేతనం కట్