Chicken Sambar: చికెన్ సాంబార్ ఒక్కసారి ఇంట్లో చేయండి.. ఎందులోకైనా అదుర్స్!
మీరు వెరైటీగా వేరే ఐటెమ్ ఏదన్నా తినాలి అనుకుంటే చికెన్ సాంబార్ ట్రై చేయండి. ఎవరైనా ఇంటికి గెస్టులుగా వచ్చినప్పుడు కూడా చేసి పెడిగే చాలా రుచిగా ఉంటుంది. టిఫిన్స్‌లోకి మరింత రుచిగా ఉంటుంది. ఇడ్లీ, పూరీ, దోశ, చపాతీ, రాగి ముద్ద ఇలా ఏ బ్రేక్ ఫాస్ట్‌లో అయినా వేసుకుని తినవచ్చు. అలాగే బగారా రైస్, అన్నంలోకి కూడా బాగానే ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల టిఫిన్స్‌లో నాన్ వెజ్ తినడం చాలా కామన్. అందులోనూ ఆది వారం వచ్చిందంటే చిల్లుగారె కోడి కూర ఉండాల్సిందే. ఎక్కువగా చాలా మంది తినే ఐటెమ్స్‌లో చికెన్ కూడా ఒకటి. చికెన్‌తో ఎలాంటి వంటలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. మీరు వెరైటీగా వేరే ఐటెమ్ ఏదన్నా తినాలి అనుకుంటే చికెన్ సాంబార్ ట్రై చేయండి. ఎవరైనా ఇంటికి గెస్టులుగా వచ్చినప్పుడు కూడా చేసి పెడిగే చాలా రుచిగా ఉంటుంది. టిఫిన్స్‌లోకి మరింత రుచిగా ఉంటుంది. ఇడ్లీ, పూరీ, దోశ, చపాతీ, రాగి ముద్ద ఇలా ఏ బ్రేక్ ఫాస్ట్‌లో అయినా వేసుకుని తినవచ్చు. అలాగే బగారా రైస్, అన్నంలోకి కూడా బాగానే ఉంటుంది. ఈ రెసిపీ తయారు చేయడం కూడా ఈజీనే. పైగా ఆరోగ్యానికి కూడా మంచిదే. మరి ఈ చికెన్ సాంబార్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చికెన్ సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
చికెన్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మిర్చి, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి పాలు, నెయ్యి, ఆయిల్, సోంపు, చింత పండు, అల్లం వెల్లుల్లి పేస్ట్.
చికెన్ సాంబార్ తయారీ విధానం:
చికెన్ సాంబార్ చేయడానికి ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చికెన్ ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఓ అరగంట పాటు పక్కన పెట్టండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేయండి. జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు, గసగసాలు వేసి వేగిన తర్వాత జీడిపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసి ఓ నిమిషం ఫ్రై చేయండి. ఇవన్నీ చల్లారాక.. మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు కూడా వేసి మిక్సీ పట్టాలి.
ఆ తర్వాత ఓ గిన్నెలో వేడి నీళ్లు వేసి.. చింత పండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి, నూనె వేసుకుని ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చి మిర్చి, మ్యారినేట్ చేసిన చికెన్ వేసి ఉడికించాలి. ముక్క కాస్త ఉడికిన తర్వాత నీళ్లు, చింత పండు రసం, మసాలా పొడి, కొబ్బరి పాలు, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. చికెన్ ముక్కలు బాగా ఉడికేంత వరకు మరిగించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ సాంబార్ సిద్ధం.