డిసెంబర్ 31 లాస్ట్ డేట్.. ఆలోపు ఈ ఒక్క పని చేయకపోతే మీరు డబ్బులు పోగొట్టుకునే ఛాన్స్..
Income Tax Return: కొత్త సంవత్సరం కొద్ది రోజుల్లో వచ్చేస్తోంది. దీంతో ఈ సంవత్సరంలో ఆర్ధికంగా పూర్తి చేయాల్సిన పెండింగ్ పనులు చాలానే ఉన్నాయి. అందులో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఒకటి. డిసెంబర్ 31లోపు మీరు దాఖలు చేయకపోతే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు..

File ITR: డిసెంబర్ 31 వచ్చేస్తోంది. ఇంకో వారం రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. ఏడాది ముగిసేలోపు మన ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి కొన్నింటికి గడువు ముగుస్తోంది. ఈ లోపు మీరు ఆ పనులు చేయకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బులను మీరు చేతులారా పొగోట్టుకున్నవారు అవుతారు. ఈ ఏడాది ముగియడానికి ఇంకా 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీరు ఉద్యోగులు లేదా వ్యాపారులు అయితే ఈ ఒక్క పని తప్పనిసరిగా చేయాల్సిందే. లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన డబ్బులు ఎప్పటికీ రావు. అదేంటంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్.
డిసెంబర్ 31తో గడువు ముగింపు
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఆలస్య రుసుం చెల్లించి మీరు ఆ గుడువులోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ తర్వాత మీరు ఫైల్ చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి వాపసు పొందలేరు. మీకు రావాల్సిన డబ్బులు ప్రభుత్వానికే వెళ్తాయి. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయకపోతే వెంటనే ఆ పని చేయండి. దీని వల్ల మీరు కట్టిన ట్యాక్స్ మనీ తిరిగి పొందుతారు. లేకపోతే మీకు నష్టమే.
సెప్టెంబర్‌తో ముగిసిన గడువు
ఎలాంటి ఛార్జీలు లేకుండా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ITR) దాఖలు చేయడానికి సెప్టెంబర్ 16 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 31 వరకు లేట్ ఛార్జీలు చెల్లించి ఐటీఆర్ దాఖలు చేసుకోవచ్చు. ఈ గడువు తర్వాత మీరు ఇక ట్యాక్స్ అమౌంట్‌ను క్లెయిమ్ చేసుకోరు. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు రూ.వెయ్యి ఆలస్య రుసుం చెల్లించి దాఖలు చేయాలి. ఇక అంతకంటే ఎక్కువ ఇన్‌కమ్ ఉన్నవారు రూ.5 వేలు లేట్ ఫీజు చెల్లించాలి.
వీటిని రెడీ చేసుకోండి
ఐటీఆర్ దాఖలు చేయడానికి ముందుగా ఫారం 16, 26AS ఫారంలను సిద్దం చేసుకోవాలి. ఇక బ్యాంక్ స్టేట్మెంట్స్, ఎల్‌ఐసీ, పీపీఎఫ్ లాంటి పెట్టుబడి ఆధారాలు, ఇంటి రెంట్, లోన్ రసీదులు, బ్యాంక్ వడ్డీ సర్టిఫికేట్స్ వంటివి రెడీగా ఉంచుకోవాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్ incometax.govలోకి వెళ్లి ఈఫైలింగ్‌పై క్లి చేసి పాన్ వివరాలు ఇవ్వాలి. మీ ఆదాయానికి తగ్గట్లు అప్లికేషన్ ఫారంను పూర్తి చేసి సబ్లిట్ చేయాలి. రిటర్న్స్ దాఖలు చేసి 30 రోజుల్లోపే ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, డీ అకౌంట్ల వాటిని వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే మీరు రిటర్న్స్ పొందగలిగే అవకాశం ఉంటుంది.




