6, 6, 6, 6, 6, 6.. 28 బంతుల్లో కోహ్లీ దోస్త్ కుమ్మేశాడుగా

TV9 Telugu

6 January 2025

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్‌లో టిమ్ డేవిడ్ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. బెల్లెరివ్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ తలపడ్డాయి.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 187 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన హోబర్ట్ హరికేన్స్‌కు మాథ్యూ వేడ్ (22), మిచెల్ ఓవెన్ (37) శుభారంభం అందించారు. 

ఆ తర్వాత మిడిలార్డర్‌లోకి అడుగుపెట్టిన టిమ్ డేవిడ్ మ్యాచ్ రూపురేఖలు మార్చేశాడు. ఆరో నంబర్‌లో వచ్చిన టిమ్ డేవిడ్.. క్రీజులోకి రాగానే తుఫాన్ బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. 

డేవిడ్ అడిలైడ్ బౌలర్లపై శివతాండం చేసి కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతే కాకుండా 28 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో అజేయంగా 62 పరుగులు చేశాడు. 

దీంతో 187 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో టిమ్ డేవిడ్ హీరోగా నిలిచాడు.

ఈ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు టిమ్ డేవిడ్ ఆడనున్నాడు. అంతకు ముందు బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న టిమ్ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు.

టిమ్ డేవిడ్ ఇలా హాఫ్ సెంచరీతో చెలరేగడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఇదే ఫాం కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు.

గతేడాది ముంబై తరపున ఆడిన టిమ్ డేవిడ్ పేలవ ఫాంతో ఇబ్బంది పడ్డాడు. మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన టిమ్ డేవిడ్ 241 పరుగులు చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు.