- Telugu News Photo Gallery Business photos Indian Railways: If you make this mistake on the train the railways will fine you
Indian Railways: రైలు ఎక్కేటప్పుడు మీరు తప్పులు చేస్తే జరిమానా, జైలు శిక్ష!
Indian Railways: రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వేలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. మన ఇండియన్ రైల్వేలో ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని ఉల్లంఘించిన ప్రయాణికులపై భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అవేంటో చూద్దాం..
Updated on: Jan 07, 2025 | 7:19 PM

భారతీయ రైల్వేలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. కానీ ఈ తప్పులు సమస్యలుగా మారే అవకాశం ఉంది. దీని కారణంగా అతనికి జరిమానా విధించబడుతుంది. భారతీయ రైల్వేలు అన్ని నియమ నిబంధనలు అమలు చేస్తుంటాయి. ప్రయాణికులెవరైనా రైలెక్కేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వారికి భారతీయ రైల్వేలు కూడా భారీగా జరిమానా విధిస్తుంటాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది.

చాలా మంది రైలు ప్రయాణం ఎక్కువగా చేస్తుంటారు. అయితే మీ మొబైల్‌లో మూడు వాట్సాప్ నంబర్లు సేవ్ చేసి ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మూడు నంబర్లు మీ రైలు ప్రయాణంలో ఎంతగానో ఉపయోగపడతాయి. రైలు టికెట్ బుక్ చేసుకోవడం దగ్గర్నుంచి రైలులో ఫుడ్ ఆర్డర్ చేయడం, అనారోగ్యం వస్తే ఇలా అన్నీ వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చు. ఈ మూడు నంబర్లు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.

అలాగే రైల్వే లైన్ దాటుతూ పట్టుబడితే లేదా రైల్వే ప్రాంగణంలో గొడవలకు దిగినా రైల్వే అధికారులు పరిశీలిస్తుంటారు. మీరు వీటిలో ఏదైనా చేస్తూ పట్టుబడితే, మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది. కారణం లేకుండా ట్రైన్‌లో చైన్ లాగి రైలును ఆపితే అది కూడా నేరమే. మీరు జైలుకు కూడా వెళ్లవచ్చు. అంతే కాకుండా రైలులో బిగ్గరగా మాట్లాడటం, గొడవలు చేయడం, ఇతర ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించినా కూడా శిక్షార్హులే.

ఇది మాత్రమే కాదు, రైలులోట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) చెకింగ్ కోసం వచ్చినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడటం, దురుసుగా ప్రవర్తించినట్లయితే, భారతీయ రైల్వే మీపై కూడా చర్య తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్ అంచున నిలబడటం, మీరు పసుపు గీతను దాటడం చేస్తుంటారు. అలా చేసిన పొరపాటే. ఎందుకంటే అలా చేయడం వలన రైలు వచ్చే సమయంలో ఎల్లో లైన్‌కు వెలుపల నిలబడాలి. ఈ నిర్లక్ష్యానికి మీరు రైల్వే చట్టంలోని సెక్షన్ 147 ప్రకారం రూ. 500 చెల్లించవలసి ఉంటుంది.

కొన్నిసార్లు రైలు రద్దీగా ఉన్నప్పుడు పురుషులు, మహిళలు వారి కోచ్‌లో కాకుండా ఇతర కోచ్‌లలో ఎక్కుతారు. లేదా వికలాంగుల కోచ్‌లో కూర్చుఉంటారు. అలా చేసిన తప్పే. జరిమానాతో పాటు జైలు శిక్ష విధించవచ్చు.




