అరేయ్.. ఎలారా తినేది.. ఈ పన్నీర్ తింటే.. చివరకు కన్నీరు పెట్టాల్సిందే..
నటరాజ్ మిల్క్ ట్రేడర్స్ పేరుతో గత కొన్నాళ్లుగా యథేచ్చగా నకిలీ పన్నీర్ అమ్మకాలు జరుగుతున్నట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు. నకిలీ పన్నీర్‌ను ఓ గోదాము కేంద్రంగా తయారు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎస్వోటీ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు.
కాదేది కల్తీకి అనర్హం అనే రీతిలో కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ.. కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తినే పదార్థం నుంచి.. ఉపయోగించే వస్తువల వరకూ అన్ని కల్తీనే.. తాగే పాలు.. నీళ్లు.. తినే పదార్థాలు అన్ని కల్తీ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. తాజాగా.. ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.. మీరు ఇష్టంగా తినే పన్నీర్.. కూడా కల్తీ అయింది.. సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ పన్నీర్ పట్టుబడింది. పక్కా సమాచారంతో SOT పోలీసులు చేసిన దాడుల్లో.. మచ్చ బొల్లారంలోని ఓ గోదాములో భారీ నకిలీ పన్నీర్ బయటపడింది. పన్నీర్‌తో పాటు గోడౌన్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు. పరీక్షల కోసం పన్నీరు శాంపిల్స్‌ను ల్యాబ్‌కి పంపారు.
నటరాజ్ మిల్క్ ట్రేడర్స్ పేరుతో గత కొన్నాళ్లుగా యథేచ్చగా నకిలీ పన్నీర్ అమ్మకాలు జరుగుతున్నట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు. నకిలీ పన్నీర్‌ను ఓ గోదాము కేంద్రంగా తయారు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎస్వోటీ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన అల్వాల్ పోలీసులు, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
పోలీసుల దాడుల్లో ఏమేం సీజ్ చేశారంటే..
600 కిలోల కల్తీ పన్నీర్ సీజ్..
పాల పౌడర్, పామాయిల్, రసాయనాలతో తయారీ
130 కేజీల పాల పౌడర్
120 లీటర్ల ఎసిటిక్ యాసిడ్
18 టన్నుల పామాయిల్
35 కిలోల గ్లానేరియల్ మెన్స్‌పాట్ సీజ్
బేగంబజార్‌కు చెందిన విశాల్ కీలక సూత్రధారి
విశాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు
కల్తీ పన్నీర్‌ని ఎలా కనిపెట్టాలి అంటే దానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. కాస్త పన్నీర్‌ను తీసుకొని వేళ్లతో నలిపి చూడాలి ఒకవేళ పన్నీర్ పిండిలాగా విరిగిపోతుంటే అది కల్తీ పన్నీర్‌గా భావించాలి. కల్తీ లేని పన్నీర్ అయితే అంత సులభంగా పిండిలా మారదు. దీనికి కారణం అసలైన పన్నీర్‌లో కొవ్వు ఉంటుంది..
వీడియో చూడండి..
కల్తీరాయుళ్లు తమను కట్టడి చేసేవాళ్లు ఎవరూ లేరనుకుంటారు. అక్రమ సంపాదనకు అదే ఆధారంగా భావిస్తుంటారు. కానీ ఏదో ఒక రోజు పట్టుబడితే ఊచలు లెక్కించాల్సి వస్తుందన్న ఇంగితజ్ఞానం ఇసుమంతైనా ఉండదు. ఒకవేళ పట్టుపడినా.. మరో కల్తీ వ్యాపారం ప్రారంభిస్తుంటారు. అందుకే.. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని.. ఇలాంటి కల్తీ వ్యాపారంపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..