Telangana: మహాత్మాగాంధీ వర్సిటీలో దారుణం.. గొడ్డుకారం అన్నమే విద్యార్ధుల బ్రేక్‌ఫాస్ట్‌

నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్ కు చెందిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్ధినులకు బ్రేక్ ఫాస్ట్ గా గొడ్డు కారం, అన్నం వడ్డిస్తున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే అసలు దీని వెనుక ఏం జరిగిందనే దానిపై భిన్నా కధనాలు వ్యక్తం అవుతున్నాయి..

Telangana: మహాత్మాగాంధీ వర్సిటీలో దారుణం.. గొడ్డుకారం అన్నమే విద్యార్ధుల బ్రేక్‌ఫాస్ట్‌
Chili Powder And Rice Served As Breakfast To Students
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 08, 2025 | 10:58 AM

నల్లగొండ, జనవరి 8: చదువులు, పాఠాలు, పరీక్షలతో సందడిగా ఉండాల్సిన విద్యావ్యవస్థ రానురానూ నీరుగారిపోతుంది. నిన్నమొన్నటి వరకు గురుకుల పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజన్లు, విషపాము కాట్లతో పలువురు విద్యార్ధులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్నత విద్యను అందించి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో ఇదే పరిస్థితి దాపురించింది. ఎన్నో ఆశలతో చదువుకోవడానికి ప్రవేశాలు పొందిన విద్యార్ధులకు.. కనీసం పట్టెడన్నం కూడా పెట్టలేని స్థితికి దిగజారిపోయింది ఆ యూనివర్సిటీ యాజమన్యం. హాస్టల్‌లో బ్రేక్‌ఫాస్‌ కింద గొడ్డుకారం, అందులో ఉప్పు వేసి.. అన్నం వడ్డిస్తున్న ఘటన నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వెలుగులోకి వచ్చింది.

నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని కృష్ణవేణి బాలికల వసతి గృహంలో మంగళవారం విద్యార్థిను బ్రేక్‌ ఫాస్ట్‌ చేసేందుకు మెస్‌కు వెళ్లారు. అక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కు బదులు అన్నంతోపాటు గొడ్డుకారం విద్యార్ధినులకు పెట్టారు. విద్యార్థులు ప్లేట్లతో క్యూలో ఉండగా అన్నం, కారం బేసిన్‌, ఉప్పు డబ్బా పక్కపక్కనే పెట్టి వడ్డించసాగారు. విద్యార్ధినులు తమకు అందిస్తున్న భోజనం ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. అవికాస్తా వైరల్‌ అయ్యాయి. ఎంజీయూలో కారం అన్నమే బ్రేస్ట్‌ఫాస్ట్‌ అంటూ చక్కర్లు కొడుతున్నాయి. అయితే అదే రోజు సాయంత్రం అదే విద్యార్థినులతో బ్రేక్‌ఫాస్ట్‌లో బోండా పెట్టారని, తాము కోరడం వల్లే గొడ్డుకారం అన్నం పెట్టారంటూ మరో లెటర్‌ విడుదల చేయించడం పలు అనుమానాలకు తావిస్తుంది.

విద్యార్థినుల తల్లిదండ్రులు మాలధారణలో ఉన్నారని, చలికాలం కావడంతో కూర ఉన్నప్పటికీ కారం అడగడం వల్లే ఇచ్చామని హాస్టల్‌ సిబ్బంది వివరణతో మరో లెటర్‌ విడుదల చేశారు. వార్డెన్లు రాజేశ్వరి, జ్యోతితో చర్చింది.. ప్రత్యక్షంగా తనిఖీలు చేయించామని, దీనిపై మరోసారి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హాస్టల్‌ డైరెక్టర్లు దోమల రమేశ్‌, కళ్యాణి ప్రకటించారు. అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో గొడ్డుకారం పెట్టడం వెనుక అసలేం జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.