Sankranti Holidays 2025: పండగే పండగ.. ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు మొత్తం ఎన్నిరోజులంటే..

సంక్రాంతి సందడి మొదలైంది.. ఇప్పటికే సెలవులపై క్లారిటీ రావడంతో జనం పల్లెబాట పట్టారు.. సంక్రాంతి సెలవులపై పాఠశాలలకు సంబంధించి ఏపీ, తెలంగాణలో క్లారిటీ వచ్చేసింది. ఇరు ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులను ప్రకటించాయి. తాజాగా.. ఇంటర్ కాలేజీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది..

Sankranti Holidays 2025: పండగే పండగ.. ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు మొత్తం ఎన్నిరోజులంటే..
Holidays
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 07, 2025 | 6:40 PM

సంక్రాంతి సందడి మొదలైంది.. ఇప్పటికే సెలవులపై క్లారిటీ రావడంతో జనం పల్లెబాట పట్టారు.. సంక్రాంతి సెలవులపై పాఠశాలలకు సంబంధించి ఏపీ, తెలంగాణలో క్లారిటీ వచ్చేసింది. ఇరు ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులను ప్రకటించాయి. తాజాగా.. ఇంటర్ కాలేజీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది.. జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది.. వరసగా ఆరు రోజులు జూనియర్ కాలేజీలకు హాలిడేస్ ప్రకటిస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది.

కాగా.. పాఠశాలలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులను ఇప్పటికే ప్రకటించాయి.. ఏపీలో 10 రోజులు, తెలంగాణలో 7 రోజులు సెలవులు ప్రకటించారు.

ఏపీలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ప్రకటించింది. 20 సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణలో జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది ప్రభుత్వం.. జనవరి 17 శుక్రవారంతో సెలవులు ముగుస్తాయని ప్రకటించింది. శనివారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..