Viral Video: కన్నడ టీచర్ అవతారమెత్తిన రాహుల్ ద్రవిడ్.. మాకు నేర్పించాలంటూ నెటిజన్ల రిక్వెస్టులు
భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్.. భారత కెప్టెన్, ప్రధాన కోచ్ పాత్రలను పోషించారు. ప్రస్తుతం ఆయన ఓ కన్నడ టీచర్‌గా మారారు. అదేంటి ఆయన కన్నడ టీచర్‌గా మారడమేంటని అనుకుంటున్నారా..
Viral Video: భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్.. భారత కెప్టెన్, ప్రధాన కోచ్ పాత్రలను పోషించారు. ప్రస్తుతం ఆయన ఓ కన్నడ టీచర్‌గా మారారు. అదేంటి ఆయన కన్నడ టీచర్‌గా మారడమేంటని అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి మరి. ద్రవిడ్ కొద్దిసేపు కన్నడ టీచర్‌గా మారిపోయారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్కు కన్నడ నేర్చుకోవాలనిపించిందంట. దీంతో రాహుల్ ద్రవిడ్ ఆయనకు కొద్దిసేపు కన్నడ నేర్పించాడు. ఈమేరకు వీడియోను అలెక్స్ ఎల్లీస్ ట్విట్టర్‌లో పంచుకున్నాడు. వేగంగా పరిగెత్తూ అనే పదాన్ని కన్నడలో బేగా ఓడి అని అనాలని రాహుల్ ద్రవిడ్ చెప్పడం నెటిజన్లకు బాగా ఆకట్టుకుంటుంది. “ఈ రోజు, మేము బెంగళూరులో ఉన్నా్ం. నాకు కన్నడ నేర్పించిన ‘కోచ్’ రాహుల్‌డ్రావిడ్ కంటే ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరుంటారు” అని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లీస్కు ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో బాగా వైరల్‌గా మారింది. శ్రీలంక పర్యటనలో రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన వన్డే సీరిస్‌ను భారత్ కైవసం చేసుకోగా, టీ20 సిరీస్‌ను శ్రీలంక టీం దక్కించుకుంది. మరోవైపు ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా జట్టు ఇంగ్లండ్‌తో తలపడుతోంది. తొలిటెస్టులో ఫలితం తేలకుండా వర్షంతో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో భారత్ విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ, వర్షంతో ఇంగ్లండ్ టీంకు కలిసివచ్చింది. కాగా సిరీస్‌లో రెండవ టెస్టు ఈ నెల12 నుంచి మొదలుకానుంది.
Cricket expressions in Indian languages part 2.
Today, we’re down south in Bengaluru.
What better teacher than ‘The Coach’ #RahulDravid, who taught taught me this in #Kannada ಕನ್ನಡ ? pic.twitter.com/tDCtHOcIwa
— Alex Ellis (@AlexWEllis) August 7, 2021
Also Read: Neeraj Chopra: బంగారు పతకం ముందు బాధలన్నీ చిన్నవే: నీరజ్ చోప్రా