TTD: శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కేసులో రెండో ఛార్జ్ షీట్ పరిస్థితేంటి? ఎంత వరకూ వచ్చింది?

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కొలువై ఉండే తిరుమల గిరులు.. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతుంటాయి. ఇప్పట్లో కరోనా కారణంగా ఇలా ఉంది కానీ.. అప్పట్లో ఇక్కడ ఆర్జిత సేవలకు విపరీతమైన..

TTD: శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కేసులో రెండో ఛార్జ్ షీట్ పరిస్థితేంటి? ఎంత వరకూ వచ్చింది?
Follow us

|

Updated on: Aug 08, 2021 | 9:22 PM

Tirumala: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కొలువై ఉండే తిరుమల గిరులు.. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతుంటాయి. ఇప్పట్లో కరోనా కారణంగా ఇలా ఉంది కానీ.. అప్పట్లో ఇక్కడ ఆర్జిత సేవలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. దీంతో పైరవీలు ఒక స్థాయిలో జరిగేవి. అందులో భాగంగా దశాబ్దం క్రితం ఆర్జిత సేవా టికెట్ల పేరిట రెండు స్కాములు జరిగాయి. వీటిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లో మొదటి దాన్లో.. ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉండగా.. రెండో కేసులో నాటి టీటీడీ బోర్డు సభ్యులు కొందరు, మరికొందరు ప్రైవేటు వ్యక్తులున్నట్టు గుర్తించారు.

తొలి కేసులో ఛార్జిషీట్ నమోదు చేసిన సీబీసీఐడీ- ఆరు మంది టీటీడీ ఉద్యోగులపై చర్య తీసుకుంది. ఇక రెండో కేసు కూడా దాదాపు విచారణ పూర్తయ్యే దశలో ఉంది. తొలికేసులో 13 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించగా- రెండో కేసులో 24 మందిపై కేసు నమోదయ్యింది. రెండో కేసులో ముగ్గురు బోర్డు సభ్యులు వారి పీఏలు ఇతర ప్రైవేటు వ్యక్తులున్నట్టు తేల్చిన సీఐడీ దాదాపు విచారణ పూర్తి చేసింది. ఈ కేసు విషయంలో త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది.

ఆర్జిత సేవల టికెట్లను ఇష్టాను సారం విక్రయించడమే ఈ కేసుల్లోని ప్రధాన ఆరోపణలు. తమకు అనుకూలమైన వ్యక్తులకు వస్త్రంతో పాటు సుప్రభాతం- తోమాల సేవ- అర్చన వంటి టికెట్లను కేటాయించినట్టు గుర్తించారు. సాక్షుల విచారణ జరిపి ప్రత్యేక కమిటీ ఒక నివేదిక ఇవ్వడంతో రెండో కేసు కూడా త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read also: Shoking: అత్యంత దారుణం.. పూర్తిస్థాయి నిర్లక్ష్యం.. అకారణంగా గాల్లో దీపాల్లా మారిన రెండు ప్రాణాలు.. రోడ్ యాక్సిడెంట్ షాకింగ్ వీడియో

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..