AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి: కష్ట సమయాల్లో ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి..! ఎంతటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది..

చాణక్య నీతి: ప్రతి ఒక్కరూ ఇతరులతో మంచి సంబంధాన్ని కోరుకుంటారు. అది వ్యాపార రీత్యా అయినా కావచ్చు లేదా వ్యక్తిగతంగానైనా కావచ్చు. ఆచార్య చాణక్య ఎప్పుడు మానవుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలనే

చాణక్య నీతి: కష్ట సమయాల్లో ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి..! ఎంతటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది..
Chanakya Niti
uppula Raju
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 09, 2021 | 6:20 PM

Share

చాణక్య నీతి: ప్రతి ఒక్కరూ ఇతరులతో మంచి సంబంధాన్ని కోరుకుంటారు. అది వ్యాపార రీత్యా అయినా కావచ్చు లేదా వ్యక్తిగతంగానైనా కావచ్చు. ఆచార్య చాణక్య ఎప్పుడు మానవుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలనే దానిపై చాలా విషయాలు చెప్పారు. ఆచార్య చాణక్యుడు తన దౌత్యం, రాజకీయంతో చంద్రగుప్త మౌర్యను చక్రవర్తిగా చేశాడు. అతని అవగాహన, తెలివితో నందా రాజవంశాన్ని అంతం చేసాడు. చాణక్య ఆర్థికశాస్త్ర పండితుడు. అతి చిన్న వయస్సులోనే అనేక గ్రంథాలు, వేదాల పరిజ్ఞానాన్ని పొందాడు.

చాణక్య పలుకులు కాలంతో పాటు నడుస్తూనే ఉన్నాయి. కాలం ఎంత మారినా చాణక్య నీతి ఇప్పటికీ ఆచరణాత్మకంగానే ఉంటుంది. ఆచార్య చాణక్య నీతిశాస్త్రంలో జీవితంలోని అన్ని కోణాల గురించి ప్రస్తావించాడు. కష్ట పరిస్థితులలో ఒక వ్యక్తి తనను తాను ప్రశాంతంగా ఎలా ఉండాలో నీతి శాస్త్రంలో చెప్పాడు. చాణక్య ప్రకారం ఒక వ్యక్తి ఈ మూడు విషయాలను తెలుసుకుంటే ఎంతటి సమస్యనైనా అధిగమిస్తాడు. వాటి గురించి తెలుసుకుందాం.

1. ఓపిక అవసరం.. ఆచార్య చాణక్య ప్రకారం.. ఎంతటి కష్టమైనా, ఎలాంటి పరిస్థితుల్లోనూ కలవరపడకూడదు. ఈ సమయంలో కుటుంబం, స్నేహితులతో ఐక్యంగా ఉండాలి. ఓపిక, సహనం చాలా ముఖ్యం. మీరు సహనంతో పని చేస్తే ప్రతికూల పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు.

2. సానుకూల వైఖరి ఆచార్య చాణక్య బ్యాడ్‌ టైంలో సానుకూల ఆలోచనను కొనసాగించాలని చెప్పారు. సంక్షోభ సమయాల్లో, ఒంటరిగా ఏమి చేయగలనో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. కష్ట సమయాలను ఎదుర్కొనే వ్యక్తి జీవితంలో కచ్చితంగా విజయం సాధిస్తాడని చెప్పాడు.

3. ఒక వ్యూహాన్ని అమలు చేయండి కష్ట సమయాలను ఎదుర్కోవడానికి ఒక వ్యూహం ఆలోచించుకోవాలని ఆచార్య సూచిస్తున్నాడు. మీ అనుభవాలే మీకు కొత్త కొత్త పాఠాలు నేర్పుతాయన్నారు. ఎవరైనా సమస్యను ఒక సవాలుగా చూడాలి అప్పడే దానిని బలంగా ఎదుర్కొంటారు.

Read Also: Tokyo Olympic 2020: ముగిసిన ఒలింపిక్ సంబురం.. భారత పతాకధారిగా బజరంగ్ పూనియా..!

సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. ఈషా అందాల ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..

Mony Mint: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ ఫోన్‌.. ఏటీఎం కార్డ్‌ అంత సైజ్‌. అలా అనీ ఫీచర్లు తక్కువేం లేవు.

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!