AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్ నుంచి డిలీట్ చేసిన ఫొటోలు కావాలా.. అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..!

గూగుల్ డిస్క్ వెబ్ లేదా మొబైల్ వెర్షన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఒక ఫోటోను తొలగించినట్లయితే, దానిని తిరిగి పొందవచ్చు.

గూగుల్ నుంచి డిలీట్ చేసిన ఫొటోలు కావాలా.. అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..!
Google Photos
Venkata Chari
|

Updated on: Aug 09, 2021 | 6:02 AM

Share

మీరు గూగుల్(Google) డిస్క్ లేదా గూగుల్ ఫోటోల నుంచి తొలగించిన ఫోటోలను కూడా తిరిగి పొందాలనుకుంటున్నారా. ఫోటోలు, ఫైల్‌లు లేదా వీడియోలను తిరిగి పొందేందుకు సెర్చ్ దిగ్గజం తాజాగా అనుమతి ఇచ్చింది. దీంతీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, 30 లేదా 60 రోజుల క్రితం తొలగించిన వాటిని మాత్రమే తిరిగి పొందగలరు. ఫొటోలను తిరిగి పొందేందుకు ఏం చేయాలో చూద్దాం.

గూగుల్ డిస్క్ వెబ్ లేదా మొబైల్ వెర్షన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఒక ఫోటోను తొలగించినట్లయితే, దానిని తిరిగి పొందవచ్చు. మీరు ఫైల్‌ను తొలగించినప్పుడు, గూగుల్ ఒక సందేశాన్ని చూపిస్తుంది. 30 రోజుల తర్వాత శాశ్వతంగా తొలగించబడుతుందని ఓ మెసేజ్ చూపిస్తుంది. అంటే, మీరు దానిని 30 రోజుల్లోపు మాత్రమే తిరిగి పొందగలరు. అదే సమయంలో, మీరు శాశ్వతంగా తొలగించడం ద్వారా ట్రాష్‌ను ఖాళీగా ఉంచుకోవచ్చు.

తొలగించిన ఫోటోలను ఎలా పొందాలి (గూగుల్ ఫొటోస్) గూగుల్ ఫొటోలు మీకు 60 రోజుల సమయాన్ని ఇస్తుంది. ఇది ఫోటోలు లేదా మెమరీని నిల్వ చేయడానికి ఉత్తమమైనది. కానీ ఆ సమయంలో మీరు రికవరీ ఆఫ్షన్‌నే చూడలేరు. ఈ సందర్భంలో మీరు కొన్ని దశలను అనుసరించాల్సి ఉంటుంది.

1. మీ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లో ముందుగా గూగుల్ ఫోటోల యాప్‌పై క్లిక్ చేయండి.

2. తర్వాత, స్క్రీన్ మధ్యలో ఉన్న లైబ్రరీ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

3. అక్కడ మీకు ట్రాష్ ఫోల్డర్ కనిపిస్తుంది. మీరు తొలగించిన అన్ని ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.

4. మీరు తిరిగి పొందాలనుకున్న ఫొటోలను సెలక్ట్ చేసుకుని క్లిక్ చేయాలి. మీ ఫొటోలు రికవరీ అయిపోయినట్టే.

ఒకవేళ మీరు తొలగించిన ఫొటో ట్రాష్‌లో కనిపించకపోతే, ఆ ఫొటో తొలగించబడి 60 రోజులకు పైగా అయ్యిందని అర్థం. అది ట్రాష్ నుంచి కూడా డిలీట్ అయినట్లు.

Also Read: Mony Mint: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ ఫోన్‌.. ఏటీఎం కార్డ్‌ అంత సైజ్‌. అలా అనీ ఫీచర్లు తక్కువేం లేవు.

Oppo: కనిపించదు, కానీ ఉంటుంది.. మరో అద్భుతానికి తెర తీసిన ఒప్పో.. అండర్‌ డిస్‌ ప్లే పేరుతో సరికొత్త ఫీచర్‌.

Google: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటామని గూగుల్‌ సంస్థకు ఉద్యోగుల లేఖ.. సంస్థ ఎలాంటి సమాధానం ఇచ్చిందంటే..!