Google: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటామని గూగుల్ సంస్థకు ఉద్యోగుల లేఖ.. సంస్థ ఎలాంటి సమాధానం ఇచ్చిందంటే..!
Google Employees: కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలపై ప్రభావం చూపింది. పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ చేసుకునేందుకు అనుమతించాయి. ఏడాదిన్నర..
Google Employees: కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలపై ప్రభావం చూపింది. పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ చేసుకునేందుకు అనుమతించాయి. ఏడాదిన్నర నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇళ్ల నుంచే ఉద్యోగం చేస్తూ వస్తున్నారు. గత కొంతకాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చాలా మంది వ్యాక్సిన్లు తీసుకోవడంతో సాఫ్ట్‌వేర్ సంస్థలు మళ్లీ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించి తమ కార్యకలాపాలు కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే చిన్న చిన్న సంస్థలు ఉద్యోగులు దాదాపు 20 శాతంకుపైగా ఆఫీసులకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఈ డిసెంబర్ వరకు కనీసం 50 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనులు చేసేలా ప్రణాళికలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆఫీసులకు రావాలంటూ ఉద్యోగులకు మెయిల్స్ కూడా పంపాయి. ఇదిలా ఉంటే.. తాజాగా గూగుల్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు పది వేల మంది ఉద్యోగులు యాజమాన్యానికి కార్యాలయానికి తిరిగి వచ్చే అంశంపై లేఖలు రాశారట.
నివేదికల ప్రకారం.. గూగుల్‌కు లేఖలు రాసిన పదివేల మంది ఉద్యోగుల్లో 55 శాతం మంది కార్యాలయం లోకేషన్‌ను మార్చాలని కోరగా, మిగతా 45 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కంటిన్యూ చేసుకుంటామని యాజమాన్యానికి దరఖాస్తు చేసుకున్నారట. అయితే ఇలా వచ్చిన పది వేల దరఖాస్తులలో దాదాపు 8500 దరఖాస్తులను గూగుల్ సంస్థ ఆమోదించినట్లు తెలుస్తోంది. కార్యాలయంకు రాకుంటే పని జరగదు అని అనుకున్న వారి దరఖాస్తులను మాత్రం గూగుల్ ఆమోదించలేదని తెలుస్తోంది. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలాగే డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటం కారణంగానే గూగుల్ తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కంటిన్యూ చేసుకునేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.