AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NASA: అంగారకుడి ఉపరితలంపై నాసా పరిశోధనలు.. జీవాన్వేషణ కోసం రోవర్‌ శోధన..!

NASA: అంతరి పరిశోధన సంస్థ నాసా అంగారకుడిపై కీలక పరిశోధనలు చేపట్టింది. పర్సెవెరెన్స్ రోవర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. అయితే అరుణ..

NASA: అంగారకుడి ఉపరితలంపై నాసా పరిశోధనలు.. జీవాన్వేషణ కోసం రోవర్‌ శోధన..!
Subhash Goud
|

Updated on: Aug 08, 2021 | 10:59 AM

Share

NASA: అంతరి పరిశోధన సంస్థ నాసా అంగారకుడిపై కీలక పరిశోధనలు చేపట్టింది. పర్సెవెరెన్స్ రోవర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. అయితే అరుణ గ్రహం మీద గతంలో జీవం ఉందా అనేది పరిశోధించేందుకు ఈ ఆరు చక్రాల రోవర్‌ను నాసా పంపింది. ఈ రోవర్‌ రెండేళ్లపాటు అక్కడే ఉండి, రాళ్లను, నేలను డ్రిల్‌ చేస్తూ జీవం ఆనవాళ్ల కోసం పరిశోధన కొనసాగిస్తుంది. ఉపరితలంపై రాతి నమూనాలను సేకరించడానికి పర్సెవెరెన్స్ చేసిన తొలి ప్రయత్నం విఫలమైనట్టు తెలుస్తోంది. అయితే పర్సెవెరెన్స్ ప్రయత్నాలకు సంబంధించిన ఫోటోలను నాసా శుక్రవారం విడుదల చేసింది. మార్స్ ఉపరితలంపై రోబో తవ్వుతున్నట్టు రోవర్ పక్కన దాని మధ్యలో రంధ్రం ఉన్న ఒక చిన్న గుట్ట ఇందులో కనిపిస్తున్నాయి. కానీ, భూ కేంద్రానికి రోవర్ ద్వారా అందిన సమాచారం మాత్రం నమూనాను సేకరించి ట్యూబ్‌లో సీల్ చేయడానికి చేసిన మొదటి ప్రయత్నం విఫలమైనట్టు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మార్స్‌పై దిగిన కాసేపటికే రోవర్‌ రెండు ఫొటోలను పంపింది. రోవర్‌కు అమర్చిన తక్కువ రిజల్యూషన్‌ కెమెరాలతో ఈ ఫొటోలను తీసింది. కెమెరా గ్లాస్‌ మీద దుమ్ము ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. అయినా రోవర్‌ ముందు, వెనక భాగాలలో ఉన్న అంగారకుడి ఉపరితలం స్పష్టంగా కనిపించింది.

భవిష్యత్తు విజయం కోసం పరిష్కారం కనుగొంటాం..

కాగా, మా ప్రయోగం ద్వారా పర్సెవెరెన్స్ భవిష్యత్తు విజయం కోసం ఓ పరిష్కారం కనుగొంటుందనే నమ్మకం ఉంది. మేము ఆశించిన ఫలితం కానప్పటికీ కొత్త ప్రయోగాల్లో ప్రమాదం ఉంటుంది.. అని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్‌కు చెందిన అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ అన్నారు. డ్రిల్లింగ్ చేయడమనేది అంగారకుడి ఉపరితలం నుంచి నమూనాల సేకరించడంలో తొలి దశ.. దీనికి 11 రోజుల సమయం పడుతుంది అని వ్యాఖ్యానించారు. అంగారకుడిపై క్షేమంగా దిగిన పెర్సెవెరన్స్ రోవర్‌.. శాస్త్రవేత్తలు నిర్దేశించినట్లు జెజెరో అనే సరస్సు ప్రాంతంవైపు సమీపానికి చేరింది. 3.5 బిలియన్ సంవత్సరాల కిందట అంగారకుడి ఈ సరస్సు ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నీరు ఉంది కాబట్టి అక్కడ జీవం కూడా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నమూనాలను పరిశీలిస్తే జీవజాలం ఉనికి గురించి సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. అయితే 2023 నాటికి అంగారకుడి నుంచి మొత్తం 30 నమూనాలను సేకరించాలని నాసా ప్రణాళిక వేసింది.

ఇవీ కూడా చదవండి

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ చేస్తున్నారా? గూగుల్‌లో యాప్స్‌ కోసం వెతుకుతున్నారా..? అయితే మీ ఖాతా ఖాళీ.. జాగ్రత్త..!

Samsung Galaxy F62: శాంసంగ్‌ బంపర్‌ ఆఫర్.. ఆ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు.. అదిరిపోయే ఫీచర్స్‌!