Bigg Boss 5: బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ప్రేమ కావాలి బ్యూటీ..? క్లారిటీ ఇచ్చిన ఇషా చావ్లా..

Bigg Boss 5: హిందీలో బిగ్‌బాస్‌ 15వ సీజన్‌ ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక తెలుగులోనూ తదుపరి సీజన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇలా ప్రకటన వచ్చిందో లేదో అలా...

Bigg Boss 5: బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ప్రేమ కావాలి బ్యూటీ..? క్లారిటీ ఇచ్చిన ఇషా చావ్లా..
Isha Chawla Bigboss
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 09, 2021 | 9:41 AM

Bigg Boss 5: హిందీలో బిగ్‌బాస్‌ 15వ సీజన్‌ ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక తెలుగులోనూ తదుపరి సీజన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇలా ప్రకటన వచ్చిందో లేదో అలా బిగ్‌ బాస్‌ హంగామా మొదలైంది. ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌ కంటెస్టెంట్‌లకు సంబంధించిన వార్తలు ప్రతి రోజూ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. పలానా అందాల ఈసారి బిగ్‌ బాస్‌ ఇంటిలోకి వెళుతుందని, పలానా యూ ట్యూబ్‌ స్టార్‌ అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకోనున్నాడని.. ఇలా రకరకాల వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై ఇప్పటి వరకు షో నిర్వాహకులు మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు.

ఇలా వినిపిస్తోన్న పేర్లలో అందాల తార ఇషా చావ్లా పేరు ఒకటి. ప్రేమ కావాలి సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. తన అందంతో కుర్రకారును మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది. అయితే 2014లో వచ్చిన ‘జంప్‌ జిలాని’ చిత్రం తర్వాత ఈ అందాల తార మరో తెలుగు సినిమాలో నటించలేదు. చివరిగా కన్నడలో వచ్చిన ‘విరాట్‌’ చిత్రం తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదు ఇషా. దీంతో ఈ అందాల తార పేరు కూడా పెద్దగా వినిపించలేదు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందన్న వార్తలు రావడంతో మరోసారి ఇషా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. గత సీజన్‌లో మోనల్‌ గజ్జర్‌ను తీసుకున్న స్థానంలో ఈసారి ఇషాను తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మీడియా ఈ విషయాన్ని ఇషాతో ప్రస్తావించగా.. తాను మాత్రం బిగ్‌బాస్‌ హౌజ్‌లో పాల్గొనడం లేదని తేల్చి చెప్పింది. మరి ఇషా నిజంగానే బిగ్‌హౌజ్‌ ఇంటి గడప తొక్కట్లేదా.? లేదా అబద్ధం చెప్పిందా? అన్న విషయాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. షో ప్రారంభానికి ముందే ఇంతలా హడావుడి చేస్తున్న బిగ్‌బాస్‌ ప్రారంభం తర్వాత ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.

Also Read: Vaccination Certificate: వాట్సాప్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్.. ఈజీగా డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

Viral Video: బస్వాపూర్ గ్రామంలో కోళ్లను మింగి కదలేని స్థితిలో పడివున్న కొండచిలువ..!! వీడియో

Pawan Rana Movie: పవన్‌ పుట్టిన రోజు కోసం సర్‌ప్రైజ్‌ సిద్ధం చేస్తున్న మేకర్స్‌.. పవన్‌ – రానాల చిత్రానికి సంబంధించి..