AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరచేతిలో దురద, గుడ్లగూబను చూడటం శుభ సూచకాలు..! మీకు డబ్బు రాబోతుందని సంకేతం.. ఎలాగో తెలుసుకోండి..

Astro Tips : జీవితంలో ప్రతి ఒక్కరు వ్యక్తి డబ్బుకోసం కష్టపడుతారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోరుకుంటారు. జ్యోతిష్యం ప్రకారం కొన్ని శుభసూచకాలు ఉంటాయి. అంటే మీరు చాలా త్వరగా ధనవంతులు అవుతారు

అరచేతిలో దురద, గుడ్లగూబను చూడటం శుభ సూచకాలు..! మీకు డబ్బు రాబోతుందని సంకేతం.. ఎలాగో తెలుసుకోండి..
Rupay
uppula Raju
|

Updated on: Aug 09, 2021 | 10:52 AM

Share

Astro Tips : జీవితంలో ప్రతి ఒక్కరు వ్యక్తి డబ్బుకోసం కష్టపడుతారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోరుకుంటారు. జ్యోతిష్యం ప్రకారం కొన్ని శుభసూచకాలు ఉంటాయి. అంటే మీరు చాలా త్వరగా ధనవంతులు అవుతారు అనడానికి కొన్ని సంకేతాలు చెప్పారు. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. మీ ఇంట్లో ఒక పక్షి గూడు కట్టుకున్నట్లయితే అది శుభ సూచకం. గూడు చేయడం అంటే మీరు ద్రవ్య ప్రయోజనాలను పొందబోతున్నారని అర్థం.

2. ఇంట్లో బల్లులు ఉండటం సర్వసాధారణం. జ్యోతిష్యుల ప్రకారం.. ఇంట్లో ఏ ప్రాంతంలోనైనా మూడు బల్లులు కలిసి కనిపిస్తే ధనలాభం ఉంటుందని అర్థం చేసుకోండి. ఇది కాకుండా బల్లులు ఒకదాని వెంట ఒకటి పరుగెత్తడం కూడా మంచి సంకేతం.

3. అప్పుడప్పుడు అరచేతిలో దురద పుడుతుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. మీరు డబ్బు విషయంలో ప్రయోజనాలను పొందబోతున్నారని అర్థం. మీ అదృష్టం త్వరలో ప్రకాశిస్తుంది.

4. ఇంట్లో శంఖం ఉంచడం వల్ల విష్ణువు ఆశీర్వాదం దొరకుతుందని నమ్మకం. జ్యోతిష్యుల ప్రకారం.. ఉదయం లేదా సాయంత్రం సమయంలో శంఖం శబ్దాన్ని వినడం శుభ సూచకం. మీరు చాలా త్వరగా ధనవంతులు కాబోతున్నారని అర్థం.

5. జ్యోతిష్య శాస్త్రంలో చీపురు పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఒక వ్యక్తి ఇంటిని తుడుచుకుంటే లేదా చీపురు నిరంతరం కనిపిస్తే మీరు త్వరలో డబ్బు పరంగా ప్రయోజనాలను పొందబోతున్నారని అర్థం.

6. కుక్క నోటిలో రొట్టెను తీసుకువెళుతున్నట్లు కనిపిస్తే మీరు డబ్బును పొందబోతున్నారని అర్థం. ఇది కాకుండా గుడ్లగూబను లక్ష్మీ దేవి వాహనంగా భావిస్తారు. మీ ఇంటి చుట్టూ అనేక రోజుల పాటు గుడ్లగూబ నిరంతరం కనిపిస్తే మీరు డబ్బు పొందుతారని అర్థం.

7. ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి.

KTR : నాకు తెలిసిన నైసెస్ట్ పర్సన్ మీరే డియర్ బ్రదర్.. మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన కేటీఆర్..

Beauty Tips : కుంకుమడి తైలంతో అందానికి సొబగులు..! ఈ 4 సమస్యలకు చక్కటి పరిష్కారం..

Justice Keshavarao: హైకోర్టు జడ్జి పి.కేశవరావు కన్నుమూత.. తెలంగాణ వ్యాప్తంగా కోర్టులకు సెలవు