AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Justice Keshavarao: హైకోర్టు జడ్జి పి.కేశవరావు కన్నుమూత.. తెలంగాణ వ్యాప్తంగా కోర్టులకు సెలవు

Juctice P Keshavarao: తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ పి.కేశవరావు కన్నుమూశారు. గుండెపోటుతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు.

Justice Keshavarao: హైకోర్టు జడ్జి పి.కేశవరావు కన్నుమూత.. తెలంగాణ వ్యాప్తంగా కోర్టులకు సెలవు
Justice P Keshava Rao
Janardhan Veluru
|

Updated on: Aug 09, 2021 | 10:32 AM

Share

తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ పొట్లపల్లి కేశవరావు(60) కన్నుమూశారు. గుండెపోటుతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. జస్టిస్ పి.కేశవరావు మృతితో రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులకు సోమవారం సెలవు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్టర్ జనరల్ ఆధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2017 సెప్టెంబర్ 21 నుంచి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన సేవలు అందించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గం.లకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ కేశవరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. జస్టిస్ కేశవరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

జస్టిస్ కేశవరావు మృతి పట్ల తెలంగాణ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,  ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు మృతి పట్ల సంతాపం తెలిపిన న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. చాలా సాధారణ జీవితం గడిపిన కేశవ రావు మంచి విలువలున్న మానవతావాది అని కొనియాడారు. కేశవరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకున్నారు.

Also Read..

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన రికవరీలు.. నిన్న ఎన్ని మరణాలంటే..?

రైల్వే ప్రయాణికులకు ముఖ్య సూచన.. రైళ్లలో ఇక ఆ సౌకర్యం అందుబాటులో ఉండదు..