Traffic Challans: విసిగిపోయాడు.. చిర్రెత్తుకొచ్చింది.. తగలబెట్టాడు.. వికారాబాద్ జిల్లాలో సంచలన ఘటన

హెల్మెట్ లేకపోయినా కాస్తా స్పీడ్‏గా పెంచి..సిగ్నల్ జంప్ చేసిన ఫోటో పడాల్సిందే.. అలా మనకు తెలియకుండానే.. మన వాహనంపై ఎన్నో చలాన్లు వెబ్‏సైట్‏లో మన వెహికల్ నంబర్ పై దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా అవే తలనొప్పిగా...

Traffic Challans: విసిగిపోయాడు.. చిర్రెత్తుకొచ్చింది.. తగలబెట్టాడు.. వికారాబాద్ జిల్లాలో సంచలన ఘటన
Fire
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 09, 2021 | 11:09 AM

హెల్మెట్ లేకపోయినా కాస్తా స్పీడ్‏గా పెంచి..సిగ్నల్ జంప్ చేసిన ఫోటో పడాల్సిందే.. అలా మనకు తెలియకుండానే.. మన వాహనంపై ఎన్నో చలాన్లు వెబ్‏సైట్‏లో మన వెహికల్ నంబర్ పై దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా అవే తలనొప్పిగా మారుతుంటాయి. ట్రాఫిక్ పోలీస్ ఎక్కడ ఉండి క్లిక్ చేసినా బండి నంబర్ సరిగ్గా పడుతుంది. ఇలాంటి ట్రాఫిక్ చలానాలతో విసిగిపోయిన ఓ సామన్యుడు ఏకంగా తన బైక్‌పై పెట్రోల్‌ పోసి తగలబెట్టడం కలకలం సృష్టిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన తలారి రత్నప్ప తనయుడు సంగప్పకు TS 34 D 2183 నంబర్‌ గల బైక్‌ ఉంది. ఆ ద్విచక్రవాహనంపై సుమారు రూ. 5,500 చలానా పెండింగ్‌లో ఉంది. బైక్ పై కూలి పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లివస్తుంటాడు సంగప్ప.. అయితే, నిబంధనలను ఉల్లంఘించారంటూ ట్రాఫిక్‌ పోలీసులు చలానాలు వేయడంతో.. ఆ మొత్తం 5 వేలు దాటేసింది.

ఇది చూసి తట్టుకోలేక పోయిన సంగప్ప చివరికి ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో తాండూర్ మండల్ గౌతాపూర్ గేటు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తన బైక్ పై రూ.5 వేలుకు పైగా చలానా ఉందని పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే చెల్లించాలని కోరారు. అయితే, పోలీసులు ఫోటోలు తీసి చలానాలు వేస్తున్న తీరు భరించలేక పెద్దేముల్ సొసైటీ వెనుక భాగంలో బాధితుడు సంగప్ప తన బైక్ ను పెట్రోలు పోసి తగలబెట్టాడు. మరి రూల్‌ అంటే రూలే.. అందరికీ ఒక్కటే రూల్‌ అని పోలీసులు అనటంతో చలానాల భయానికి బైక్‌నే తగలబెట్టడం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

తన ద్విచక్రవాహనంపై 5,500 రూపాయల చలానాలున్నాయని సంగప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. కూలీగా పనిచేసే తాను ఇంత మొత్తాన్ని ఎలా కట్టగలనని సంగప్ప ప్రశ్నిస్తున్నాడు. ఆవేదనతోనే తాను బైక్‌ను తగలబెట్టానని చెప్పాడు. బైక్ తనకు అత్తింటివారు బహుమానంగా ఇచ్చారన్నాడు.

(శ్రావణ్, టీవీ9 తెలుగు, హైదరాబాద్)

ఇవి కూడా చదవండి: Journalist Murder: గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు కేశవ దారుణ హత్య.. కర్నూలు జిల్లాలో దారుణం..

Dating App: ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇచ్చే డీల్స్‌పై భారతీయులు భయపడుతున్నారు.. సర్వేలో తేలిన నమ్మలేని నిజాలు..