AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips : కుంకుమడి తైలంతో అందానికి సొబగులు..! ఈ 4 సమస్యలకు చక్కటి పరిష్కారం..

Beauty Tips : చర్మాన్ని కాంతివంతంగా అందంగా చేయడానికి సహజ మూలికలు, నూనెలు చక్కగా ఉపయోగపడుతాయి. ఆయుర్వేదం ప్రకారం.. సహజమైన మూలికలు, నూనెలను కలపడం ద్వారా కుంకుమడి

Beauty Tips :  కుంకుమడి తైలంతో అందానికి సొబగులు..! ఈ 4 సమస్యలకు చక్కటి పరిష్కారం..
Beauty Tips
uppula Raju
|

Updated on: Aug 09, 2021 | 10:34 AM

Share

Beauty Tips : చర్మాన్ని కాంతివంతంగా అందంగా చేయడానికి సహజ మూలికలు, నూనెలు చక్కగా ఉపయోగపడుతాయి. ఆయుర్వేదం ప్రకారం.. సహజమైన మూలికలు, నూనెలను కలపడం ద్వారా కుంకుమడి తైలం తయారు చేశారు. ఇది ఆయుర్వేద నూనె చర్మానికి మెరుపును అందించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మంపై ఫేషియల్, మాయిశ్చరైజర్, క్లెన్సర్, టోనర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మానికి సంబంధించి ఈ 4 సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.

1. సహజ కాంతి ఈ నూనెను సహజ, సేంద్రీయ మూలికలను కలపడం ద్వారా తయారు చేస్తారు. ఇది చర్మం రంగును మెరుగుపరుస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మంలో రక్త ప్రసరణను పెంచడానికి, కణాలను పోషించడానికి పనిచేస్తాయి. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా ఉంచడానికి సహాయపడుతుంది.

2. స్కిన్ టోన్‌ను ప్రకాశవంతం చేస్తుంది మీ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కుంకుమడి నూనెను చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. ఇది చర్మ రంగును ప్రకాశవంతం చేస్తుంది. క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల ముడతలు తొలగిపోతాయి.

3. చర్మం వాపును తగ్గిస్తుంది కుంకుమడి నూనెలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ నూనెలో ఉండే మూలికలు దురద, మంట, దద్దుర్లు తగ్గించడంలో సహాయపడతాయి. టీ ట్రీ ఆయిల్‌తో కలిపి ఈ నూనెను రెగ్యులర్‌గా అప్లై చేయడం ద్వారా చర్మంపై మంట, ముఖంపై మచ్చలు తగ్గుతాయి.

4. మొటిమలను తొలగిస్తుంది కుంకుమడి నూనె చర్మంపై మొటిమలను తొలగిస్తుంది. ఈ నూనె చర్మంలో క్లెన్సర్ లాగా పనిచేస్తుంది. ఇది చర్మంలో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి పనిచేస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ వదిలించడానికి సహాయపడుతుంది.

Viral Video: ఏటీఎం చోరీకి ప్రయత్నం.. సందులో ఇరుక్కుపోయిన దొంగ.. చివరికి ఏమైందంటే..?? వీడియో

Accident: నిద్రలోనే మృత్యు ఒడిలోకి.. గుడిసెలోకి దూసుకొచ్చిన ట్రక్కు.. 8 మంది దుర్మరణం..

Chalo Indravelli: ఆత్మగౌరవ దండోరా పేరుతో కాంగ్రెస్‌ పోరాటం.. ఇంద్రవెల్లిలో హై టెన్షన్‌..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..