గరుడ పురాణం : జీవితంలో ఈ 4 పరిస్థితులు దుఖాన్ని మిగుల్చుతాయి..! అప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలంటే..?

గరుడ పురాణం : 18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. మరణం తరువాత జరిగే పరిస్థితులను వివరించడమే ఈ గ్రంథం ఉద్దేశ్యం. మానవ సృష్టి ప్రారంభం నుంచి మరణం వరకు కర్మ ప్రకారం చేయవలసినవి,

గరుడ పురాణం : జీవితంలో ఈ 4 పరిస్థితులు దుఖాన్ని మిగుల్చుతాయి..! అప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలంటే..?
Garudapurana
Follow us

|

Updated on: Aug 09, 2021 | 12:30 PM

గరుడ పురాణం : 18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. మరణం తరువాత జరిగే పరిస్థితులను వివరించడమే ఈ గ్రంథం ఉద్దేశ్యం. మానవ సృష్టి ప్రారంభం నుంచి మరణం వరకు కర్మ ప్రకారం చేయవలసినవి, చేయకూడని వాటిని వివరిస్తుంది. గరుడ పురాణంలో జీవితాన్ని మెరుగుపరచడానికి అన్ని నియమాలు చెప్పారు. దీనితో పాటుగా సూర్యారాధన పద్ధతి, దీక్షా పద్ధతి, శ్రద్ధా ఆరాధన, నవవ్యూహ ఆరాధన, భక్తి, జ్ఞానం, నిర్లిప్తత, ధర్మం, నిస్వార్థ చర్య, వైభవం ఇందులో తెలిపారు. గరుడ పురాణం ప్రధాన దేవత విష్ణువు, అతని వాహనం గరుడ. విష్ణువు, గరుడల మధ్య జరిగిన ప్రశ్న, సమాధానాల వివరణే ఇందులో చెప్పబడింది. ఈ గ్రంథం ప్రకారం.. మానవ జీవితంలో 4 పరిస్థితులను ఏ విధంగా ఎదుర్రోవాలో తెలియజేశారు.

1. జీవిత భాగస్వామి నమ్మకాన్ని ఉల్లంఘిస్తే గరుడ పురాణం ప్రకారం.. భార్యాభర్తల వైవాహిక జీవితానికి పునాది నమ్మకం. ఇద్దరు ఒకరికి ఒకరు ద్రోహం చేసుకోకూడదు. ఎందుకంటే ఒకసారి నమ్మకం కోల్పోతే మళ్లీ తీసుకురాలేరు. మీరు మీ జీవిత భాగస్వామి విశ్వాసాన్ని కోల్పోతే మీ మొత్తం కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. మీ జీవితం నాశనమవుతుంది. అప్పుడు మీరు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు.

2. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురైనప్పుడు జీవిత భాగస్వామి అనారోగ్యంతో ఉండటం వల్ల జీవితంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు ఇంటి పరిస్థితి కూడా క్షీణిస్తుంది. ఆర్థిక నష్టం జరగడమే కాదు మీరు కూడా మనశ్శాంతిగా ఉండలేరు. అటువంటి పరిస్థితిలో జీవిత భాగస్వామికి పూర్తి భక్తితో సేవ చేయాలి. ఏ స్థితిలోనైనా అతడిని/ఆమెను ఆరోగ్యవంతుడిని చేయడానికి ప్రయత్నించాలి. అనారోగ్యం సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది.

3. కొద్దిగా అవమానించాలి ప్రతి ఒక్కరూ జీవితంలో గౌరవాన్ని కోరుకుంటారు. కానీ ఒక వ్యక్తి తన కంటే చిన్న వ్యక్తి ద్వారా అవమానించవలసి వస్తే అది చాలా నరకం. అటువంటి సమయంలో ఓపికగా అక్కడి నుంచి వెళ్లిపోవాలి. కోపం అక్కడి పరిస్థితులను మరింత దిగజార్చవచ్చు.

4. పదేపదే విఫలమైతే.. ఏదైనా పని గురించి ప్రయత్నించినపుడు పదే పదే విఫలమైతే దుఖంతో పాటు డిప్రెషన్‌లోకి వెళ్లే పరిస్థితి దాపురిస్తుంది. అటువంటప్పుడు మీ పరిస్థితులను ఒకసారి విశ్లేషించుకోవాలి. ఎక్కడ తప్పు జరుగుతుందో వెతికి పట్టుకోవాలి. ఓపికగా దానిని సరి చేసుకోవాలి. అప్పుడు విజయం మీ సొంతమవుతుంది. ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి.

ఈ 4 రకాల బియ్యాలలో ఏవి ఉత్తమం..! ఆరోగ్యానికి ఏ బియ్యం మంచివో.. తెలుసుకోండి..

Gravel Mafia: గ్రావెల్ మాఫియాపై గ్రామస్థుల కన్నెర్ర.. నెల్లూరు జిల్లా కంటేపల్లిలో కొనసాగుతున్న ఉద్రిక్తత..

Happy Birthday Hansika: పరువాల పాలరాతిశిల్పం పుట్టినరోజు నేడు.. హ్యాపీ బర్త్ డే టూ హన్సిక..