Gravel Mafia: గ్రావెల్ మాఫియాపై గ్రామస్థుల కన్నెర్ర.. నెల్లూరు జిల్లా కంటేపల్లిలో కొనసాగుతున్న ఉద్రిక్తత..

Nellore district: నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియాపై స్థానికులు కన్నెర్రజేశారు. దీంతో వెంకటాచలం మండలం కంటేపల్లిలో

Gravel Mafia: గ్రావెల్ మాఫియాపై గ్రామస్థుల కన్నెర్ర.. నెల్లూరు జిల్లా కంటేపల్లిలో కొనసాగుతున్న ఉద్రిక్తత..
Nellore District
Follow us
Shaik Madar Saheb

| Edited By: TV9 Telugu

Updated on: May 07, 2024 | 12:48 PM

Nellore district: నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియాపై స్థానికులు కన్నెర్రజేశారు. దీంతో వెంకటాచలం మండలం కంటేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కంటేపల్లిలోని అటవీ భూముల్లో గత కొంతకాలం నుంచి భారీ ఎత్తున గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కంటేపల్లి ఎస్సీ కాలనీ వద్ద టిప్పర్ లారీ తగిలి ఇళ్ల మీద విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అయితే.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తృటిలో పెనుప్రమాదం తప్పినట్లయిందని గ్రామస్థులు పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటన అనంతరం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దాదాపు 10 టిప్పర్లను అడ్డుకుని గ్రామంలో నిర్భంధించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు న్యాయం చేస్తామని పేర్కొన్నప్పటికీ.. గ్రామస్థులు వినకుండా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్థానికులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అటవీ భూముల్లో గ్రావెల్ మాఫియా పెచ్చుమీరుతుందని.. గ్రామస్తులు పేర్కొంటున్నారు.

ఎస్సైని నమ్మి వాహనాలను అప్పగించలేమని కాలనీ వాసులు పేర్కొన్నారు. 40కి పైగా టిప్పర్లు, కొన్ని ప్రొక్లెయిన్లను అక్కడి నుంచి పంపించిన తర్వాతే పోలీసులు వచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా ఉన్నతాధికారులు వచ్చి గ్రావెల్ తవ్విన అటవీ భూములను పరిశీలించాలని.. మిగిలిన 40 టిప్పర్లు, ఐదు ప్రొక్లెయిన్లు కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు గ్రావెల్ మాఫియా వెనుక ఉన్న పెద్ద కీలక వ్యక్తిని కూడా బయటకు తేవాలని గ్రామస్థులు అధికారులకు స్పష్టంచేశారు. అటవీ భూముల్లో విలువైన సంపదను కొల్లగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అధికారులు పట్టించుకోకపోవడంతో తమ ప్రాణాల మీదకు వచ్చిందని.. నిత్యం వందలాది లారీలు తమ ఇళ్ల ప్రాంతాల నుంచి వెళుతున్నాయని పేర్కొన్నారు. ఎప్పుడు ఎలాంటి సంఘటన జరుగుతుందోనని నిత్యం భయపడుతున్నామని.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా.. గ్రామంలో ఇంకా ఆందోళన కొనసాగుతోంది. అయితే.. పోలీసులను గ్రామంలో భారీగా మోహరించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. నేడే తొమ్మిదో విడత పీఎం కిసాన్ సొమ్ము జారీ.. చెక్ చేసుకోండిలా!