PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. నేడే తొమ్మిదో విడత పీఎం కిసాన్ సొమ్ము జారీ.. చెక్ చేసుకోండిలా!
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) కింద 9వ విడత నిధులను పీఎం...
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) కింద 9వ విడత నిధులను పీఎం నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా 9.75 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. వీరికి సుమారు రూ. 19,500 కోట్లను ఇవాళ విడుదల చేస్తారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద, సంవత్సరానికి 6000/- రూపాయల ఆర్థిక ప్రయోజనం అర్హత కలిగిన లబ్ధిదారు రైతు కుటుంబాలకు అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు సమానమైన వాయిదాలలో అంటే నాలుగు నెలలకు ఓసారి 2000 రూపాయల చొప్పున రైతులకు అందిస్తారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకంలో, ఇప్పటివరకూ 1.38 లక్షల కోట్లు రైతు కుటుంబాలకు బదిలీ చేయడం జరిగింది.
మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా..
మొదటిగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్ పేజీ pmkisan.gov.in కి వెళ్లండి.
ఆ తర్వాత హోమ్ పేజీలో ఉన్న ‘లబ్ధిదారుని స్థితి’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
ఇక ఇప్పుడు తెరుచుకునే విండోలో, ఏదైనా ఎంపికను ఎంచుకోండి – ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్.
ఎంచుకున్న ఎంపికను ఎంచుకున్న తర్వాత, ‘డేటాను పొందండి’ పై క్లిక్ చేయండి. డేటా మీ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. లేదా
అక్కడే కనిపించే ‘పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్’ డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి
Read Also: నీళ్లు తాగుతున్న ఏనుగుపై మొసలి దాడి చేసింది.. గజరాజుకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా..
సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!
అమ్మాయి టిక్ టాక్ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..
భారత్ వెయిట్ లిఫ్టర్లకు షాక్.. ఒలింపిక్స్ కమిటీ సంచలన నిర్ణయం..